Home » పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న బిగ్ బ్యూటీ నేహా చౌద‌రి..వ‌రుడు ఎవ‌రంటే..?

పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న బిగ్ బ్యూటీ నేహా చౌద‌రి..వ‌రుడు ఎవ‌రంటే..?

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నేహా చౌదరి. స్పోర్ట్స్ యాంకర్ గా నేహా చౌదరి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా జిమ్నాస్టిక్ విభాగంలో జాతీయస్థాయి ఛాంపియన్షిప్ గా నిలిచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ముందుగా స్పోర్ట్స్ లోనే నేహా చౌద‌రి రాణించింది. స్పోర్ట్స్ లో రాణించడంతోపాటు నటనపై ఉన్న ఆసక్తితో యాంకర్ గా బుల్లితెరవైపు అడుగులు వేసింది.

Advertisement

అలా స్పోర్ట్స్ యాంకర్ గా ఐపీఎల్ స‌మ‌యంలో తెలుగు యాంక‌ర్ గా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. అలా సెల‌బ్రెటీగా మారిన నేహా చౌద‌రి బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు చేయ‌డంతో పాటూ తన క్యారెక్టర్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నేహా చౌదరి తన అభిమానులకు ఓ తీపిక కబురు వినిపించింది.

Advertisement

త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్క‌బోతున్నట్టు నేహా చౌదరి ప్రకటించింది. అంతేకాకుండా తాను పెళ్లి చేసుకోబోయే వరుడిని నేహ చౌదరి నెటిజ‌న్ల‌కు పరిచయం చేసింది. తను చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు స్పష్టం చేసింది. అతడి పేరు అనిల్ అని ప్రకటించింది. ఇక అనిల్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నెటిజన్లు సైతం బిగ్ బాస్ బ్యూటీని పెళ్లి చేసుకోబోయే వ‌రుడు ఎవ‌రు అని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.

Visitors Are Also Reading