Home » బిగ్ బాస్ -6 : అప్పుడు మోనాల్.. ఇప్పుడు శ్రీ సత్య..మొదటి రోజే అంత పని చేసిందేంటి..?

బిగ్ బాస్ -6 : అప్పుడు మోనాల్.. ఇప్పుడు శ్రీ సత్య..మొదటి రోజే అంత పని చేసిందేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఇప్పటికి ఇరవై మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి అడుగుపెట్టారు. వచ్చిన మొదటి రోజు నుంచే వారి పర్ఫామెన్స్ చూపిస్తున్నారు.. అంతకుముందు సీజన్లో మోనాల్ ఏ విధంగా ప్రవర్తించిందో శ్రీ సత్య కూడా అదే బాటలో వెళ్తోంది. మరి ఈ శ్రీసత్య ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో మనము ఓ లుక్కేద్దాం.. బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ శ్రీ సత్య. ఎంబిబిఎస్ చదువును పక్కనపెట్టి మరీ మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. చూడటానికి ఎంతో చక్కగా పాలబుగ్గల తో ఉండి ఎంతో అందంగా కనబడుతుంది.

Advertisement

ALSO READ;బాల‌య్య సినిమాల్లో ఉండే ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..? అదేంటో తెలిస్తే జై బాల‌య్య అనాల్సిందే..?

ఇప్పటికే బిగ్ బాస్ లో శ్రీ సత్య ని అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె గతంలో మోనాల్ ఏ విధంగా అయితే గోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండేదో ఇప్పుడు శ్రీ సత్య ఆమెను డామినేట్ చేసే రేంజ్ లో కనబడుతోంది. చూడ్డానికి ఎంతో క్యూట్ గా కనిపించే బ్యూటీ హౌస్ లో అదరగొట్టే విధంగా కనబడుతోంది. బిగ్ బాస్ లో అడుగు పెట్టక ముందు శ్రీ సత్య సీరియల్స్ లో అదరగొట్టింది. ఎంతో ఫ్రీగా ఉండే ఈ అమ్మడు బిగ్ బాస్ లో ఏ విధంగా కలిసి పోతుందో లేదో అనేది చూస్తూ ఉండాలి. మొత్తానికి మోనాల్ అందాల కు దీటుగా శ్రీ సత్య ను హౌస్ లోకి కుర్రాళ్లను టార్గెట్ చేయడానికి తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఖచ్చితంగా ఈమెకు హౌస్ లో లవ్ ఎఫైర్ పెట్టడం గ్యారెంటీ అని కూడా కనబడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ పెళ్లయిన వారే ఉండటం, లేదంటే రిలేషన్ లో ఉన్నవారు, గర్ల్ ఫ్రెండ్స్,బాయ్ ఫ్రెండ్స్ లు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ శ్రీ సత్య మాత్రం సోలో గా కనిపిస్తోంది. జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన ఈ అమ్మడు, హౌస్ లోకి ఏకంగా చికెన్ కూడా తెచ్చేసుకుంది. ఈ రేంజ్ లో పేరు సంపాదించుకున్న శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ నుండి ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో మనం ముందు ముందు చూడాలి. శ్రీ సత్య తన అందాలతో అదరగొడుతోందని ఒక్కరోజులోనే ఆమె కు ఫ్యాన్ ఆర్మీ గా ఏర్పడినట్లు తెలుస్తోంది.

ALSO READ;ఈ ముగ్గురు న‌టుల విష‌యంలో జ‌రిగిన విచిత్ర‌మైన‌ ఘ‌ట‌న ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading