Telugu News » Blog » Bigg Boss -5 : ఉత్కంఠకు తెర…బిగ్ బాస్ విన్నర్ గా వీజే సన్నీ…!

Bigg Boss -5 : ఉత్కంఠకు తెర…బిగ్ బాస్ విన్నర్ గా వీజే సన్నీ…!

by AJAY
Ads

బిగ్ బాస్ సీజన్ -5 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే చివరి వారం కూడా ఎండింగ్ కు చేరుకుంది. బిగ్ బాస్ టాప్-5 లో సిరి, షణ్ముక్, సన్నీ, మానస్, శ్రీ రామ్ లు ఉన్న సంగతి తెలిసిందే. కాగా శనివారం బిగ్ బాస్ హౌస్ కు గత సీజన్ లోని కంటెస్టెంట్ లు వచ్చి సందడి చేశారు. ఇదే చివరి వారం కావడం తో ఎలాంటి టాస్క్ లు లేకుండా టాప్ 5 కంటెస్టెంట్ లకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో బిగ్ బాస్ అలరించారు. గత వారల్లోని అనుభవాలు.. ఇంట్లో ఎదుర్కొన్న పరిస్థితులు అన్నీ గుర్తు చేస్తూ జ్ఞాపకాలను నెమరు వేయించారు.

Advertisement

BIGG BOSS VJ SUNNY

BIGG BOSS VJ SUNNY

ఇక ఎన్ని వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ విన్నర్ ఎవరన్నది ఒక్కరోజులో తేలనుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ టాప్ -3 లో ఎవరు ఉన్నారు.? ఎవరు ఎలిమినేట్ అయ్యారు.? విన్నర్ ఎవరు అన్నది లీకురాయుల్లు బయటపెట్టారు. ఆ సమాచారం ప్రకారంగా…. బిగ్ బాస్ లో టాప్ 5 నుండి తక్కువ ఓట్లు పడటంతో మొదటగా సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఆ తర్వాత మానస్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇక అదే విధంగా షణ్ముక్, శ్రీ రామ్, సన్నీ టాప్ -3 లో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Advertisement

Read also : జైల్లో ఉన్న ఆర్థిక నేరస్థుడిని కలిసేందుకు వెళ్లిన 12 మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు, మోడల్స్…!

అయితే వీరిలో వీజే సన్నీ విన్నర్ కాగా షణ్ముక్ రన్నర్ గా శ్రీరామ్ టాప్ -3 లో ఉన్నట్టు సమాచారం.  తాజాగా వచ్చిన పోల్స్ చూసినా కూడా సన్నీ లేదా షణ్ముఖ్ విన్నర్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక విన్నర్ ఎవరు అయ్యారు.. టాప్ -3 లో ఎవరున్నారు అన్నదానిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే