Home » Bigboss:హోస్ట్ గా నాగార్జున రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే..!!

Bigboss:హోస్ట్ గా నాగార్జున రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఉన్న బుల్లితెర లో బిగ్ బాస్ రియాలిటీ షో అంటే జనాల్లో ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ బిగ్ బాస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరో సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది.. దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదలైంది.. ఈ తరుణంలో ఈ షోకు ఇన్ని రోజులు హోస్ట్ గా ఎవరు వస్తారు అనేది సస్పెన్స్ గా ఉండేది.. కానీ తాజాగా వచ్చిన ప్రోమో ద్వారా నాగార్జున మళ్లీ హోస్ట్ గా వస్తున్నారనే విషయం అర్థమైపోయింది.. కానీ ఈసారి నాగార్జున భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.. మరి ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది మనం చూద్దాం..

also read:

Advertisement

బిగ్ బాస్ రియాల్టీ షో సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ షో కు మొదటి సీజన్ లో హోస్ట్ గా ఎన్టీఆర్ చేయగా, రెండో సీజన్ లో నాని చేశారు.. వీరిద్దరు చేసినప్పుడు షో అంతగా ఆదరణ పొందలేదు. కానీ మూడు,నాలుగు,ఐదు సీజన్లు నాగార్జున హోస్ట్ గా చేసినప్పుడు షో జనాలకు బాగా కనెక్ట్ అయింది..

Advertisement

ప్రస్తుతం ఆరవ సీజన్ లో కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తూ ఒక్క ఎపిసోడ్ కు 55 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంటే మొత్తం 15 వారాలు గ్రాండ్ ఫినాలే తో కలిపి మొత్తం 16.50 కోటి రూపాయల పారితోషికం అందనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ షో ఆగస్టు చివరి వారంలోనే ప్రారంభమయ్యేది కానీ, ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవ్వనుందని తెలుస్తోంది. అలాగే ఈసారి హోస్ట్ గా యాంకర్ శివ కూడా ఉండనున్నారని సమాచారం.

also read:

Visitors Are Also Reading