బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ షో ప్రేక్షకులకు అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వలేదని చెప్పవచ్చు. 21 మంది కంటెస్టెంట్లతో మొదలైన షో ప్రతి వారం అనుకోని ఎలిమినేషన్లతో ముందుకు సాగింది. కానీ ఈ సీజన్ లో మిగతా సీజన్ల కంటే ఎక్కువగానే ప్రైజ్ మనీ వస్తుందని తెలుస్తోంది. విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు ఉండగా సువర్ణభూమి ప్లాట్ ఖరీదు 25 లక్షలు. అంతేకాకుండా బ్రిజా కారు కూడా ఇస్తున్నారు. కట్ చేస్తే ప్రతి సంవత్సరం ఫైనలిస్టుల్లో సూట్ కేస్ ఆఫర్ అనేది ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం సూట్ కేస్ ఆఫర్ ఎవరు దక్కించుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 18 ఆదివారం జరగనుంది.
Advertisement
also read:ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిసిన 5 హాలీవుడ్ చిత్రాలు…!
దీంతో ప్రేక్షకుల చూపంతా ఫైనల్ విన్నర్ మరియు సూట్ కేస్ ఆఫర్ ఎవరు దక్కించుకుంటారు అనే దానిపైనే పడింది. ఇప్పటికే హౌస్ లో టాప్ కంటెస్టెంట్లుగా ఉన్న సింగర్ రేవంత్ , ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్, కీర్తి బట్ ఐదుగురు ఉన్నారు. మిడ్ వీక్ లో శ్రీ సత్య బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ తరుణంలో బిగ్ బాస్ ఫినాలేలో డబ్బుతో కూడిన బ్రీఫ్ కేస్ ఆఫర్ చాలా ఆసక్తికరమైన టాస్క్. ఈ ఆఫర్ ఎవరు ఎంచుకుంటే వారు ఈ బ్రీఫ్ కేస్ తో 25 లక్షల రూపాయలు తీసుకొని బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే విన్నర్ కి వచ్చే 50 లక్షల్లో సగం అన్నమాట. ఇక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈసారి సాధారణ వ్యక్తిగా హౌస్ లోకి అడుగుపెట్టి ఫైనల్ వరకు చేరిన ఆదిరెడ్డి బ్రీఫ్ కేస్ ఆఫర్ ను ఎంచుకుంటారని టాక్ బయట నడుస్తోంది.
Advertisement
ఎందుకంటే ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి తన మాట తీరు ప్రవర్తనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని చెప్పవచ్చు. అలాంటి ఆదిరెడ్డి ఫైనల్ వరకు చేరారు. ఆయన ఒకవేళ బ్రీఫ్ కేస్ ఆఫర్ స్వీకరించకపోతే 25 లక్షల రూపాయలు మిస్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఒక సామాన్య వ్యక్తిగా అది రెడ్డికి చాలా పెద్ద అమౌంట్. ఇక రేవంత్, శ్రీహన్ ల మధ్య మాత్రం భారీ కాంపిటీషన్ ఉంది.. కాబట్టి చాలా తెలివిగా ఆలోచించి ఆదిరెడ్డి ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే మాత్రం చాలా ఉపయోగ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గతంలో ఈ టాస్క్ లో పది లక్షల రూపాయలు తీసుకున్న అరియనా, అలాగే సీజన్ 4 లో 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చిన సోహెల్ లాగే ఆదిరెడ్డి కూడా ఇది వినియోగించుకుంటే బాగుంటుందని అభిమానులంతా భావిస్తున్నారు. మరి చూడాలి ఈరోజు ఏం జరుగుతుందో..
also read: