Home » Bigboss6: మీకు తెలుసా.. వైల్డ్ కార్డుతో రీఎంట్రీ ఇవ్వనున్న గీతూ..!!

Bigboss6: మీకు తెలుసా.. వైల్డ్ కార్డుతో రీఎంట్రీ ఇవ్వనున్న గీతూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ సీజన్ 6.. ఈ సీజన్ కంటెస్టెంట్లలో గలాటా గీతూ పర్ఫామెన్స్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తనదైన పర్ఫామెన్స్ తో హౌస్ లో మొత్తం అల్లరి అల్లరిగా ఉండేది గీతూ. దీంతో చాలామంది ప్రేక్షకులకు గీతూ పై ప్రేమ, ద్వేషం రెండూ పెరిగాయి. ఆ తర్వాత గీతూ ఎలిమినేషన్ జరిగింది. దీంతో ఆ ఎలిమినేషన్ పై పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. గీతూ ఎలిమినేషన్ అన్యాయం,మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరికొందరేమో బాబోయ్ భరించింది చాలు ఇక వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు..

Advertisement

ఈ తరుణంలో గీతూ ని మరలా హౌస్ లోకి తీసుకోవాలా.. వద్ద అనే సందిగ్ధంలో బిగ్ బాస్ నిర్వాహకులు పడ్డారట. ఈ తరుణంలోనే వారు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. గీతూ పై నెగిటివిటీ ఉన్నప్పటికీ కంటెస్టెంట్లను రెచ్చగొట్టి గేమ్ అగ్రిస్సివ్ ఆడేలా చేసింది. కనీసం గేమ్ పై అవగాహన లేనటువంటి కంటెస్టెంట్లకు గేమ్ గురించి చెప్పింది. ప్రస్తుతం గీతూ ఎలిమినేషన్ అయిన నేపద్యంలో హౌస్ లో ఆట తీరుపై పెను మార్పులు రావడం ఖాయం. మునుపటి తెగువ కంటెస్టెంట్లలో కనిపించకపోవచ్చు. ఇదే జరిగితే టిఆర్పి రేటింగ్ మరింత దిగజారుతుంది.

Advertisement

also read:అతడో ట్రాన్స్ కో AE.. పెళ్ళంటూ యువతిని నమ్మించి మత్తుమందు ఇచ్చి చివరికి..!

అప్పుడు గీతు రీ ఎంట్రి తప్పదు. అయితే రానున్న రోజుల్లో బిగ్ బాస్ షో వారు అనుకున్నంత పర్ఫామెన్స్ లేకుంటే గీతూ ను మళ్ళీ పంపడానికి సిద్ధంగా ఉన్నారట.. అయితే వైల్డ్ కార్డుతో రీ ఎంట్రీ ఇచ్చినా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చి వెళ్ళిన వారికి ఆ ఛాన్స్ ఉండదు. గతంలో కూడా ఆలీ రెజా ఎలిమినేట్ అయి వైల్డ్ కార్డుతో రీయంట్రీ ఇచ్చారు. అతడు ఫైనల్ కి చేరాడు కానీ టైటిల్ అందుకోలేదు.. మరి చూడాలి రానున్న రోజుల్లో బిగ్ బాస్ షో లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో, గీతూ రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

also read:హీరో అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాకే..!

Visitors Are Also Reading