Home » వరంగల్ శ్రీనుకు మళ్ళీ గట్టి దెబ్బ..!

వరంగల్ శ్రీనుకు మళ్ళీ గట్టి దెబ్బ..!

by Azhar
Ad

వరంగల్ శ్రీను అనేది టాలీవుడ్ లో ఎక్కువగా తెలిసన పేరే. తెలంగాణలో విడుదలయ్యే ఎక్కువ సినిమాలకు నిర్మాత అయిన దిల్ రాజు డిస్టిబ్యూటర్ గా ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో దిల్ రాజు థియేటర్లను తన ఆధీనంలో ఉంచుకున్నాడు అంటూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో వరంగల్ శ్రీను ఒక్కరు. ఈయన కూడా డిస్టిబ్యూటర్. ఇక తెలంగాణలో దిల్ రాజును నేనే పోటీ అని వరంగల్ శ్రీను చాలాసార్లు చెప్పాడు.

Advertisement

అయితే ఇప్పుడు ఈ వరంగల్ శ్రీనుకు వరుసగా భారీ నష్టాలూ.. దెబ్బ దెబ్బల పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మొదట ఆచార్య సినిమాకు మొత్తం రైట్స్ అనేవి తీసుకొని వరంగల్ శ్రీను తెలంగాణలో విడుదల చేసారు. కానీ అది ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అందరికి తెలిసిందే. ఆచార్య సినిమా వల్ల వరంగల్ శ్రీనుకు గట్టి దెబ్బ అనేది తాకినట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ ఆచార్య కొట్టిన దెబ్బ నుండి కోలుకోకముందే వరంగల్ శ్రీనుకు మరో దెబ్బ పడినట్లు సమాచారం. అదే లైగర్ రూపంలో. విజయ్ దేవరకొండ, పూరి జానాథ్ కాంబినేషన్ లో తాజాగా వచ్చిన సినిమా లైగర్. ఇక ఈ సినిమాను కూడా తెలంగాణలో వరంగల్ శ్రీనునే తీసుకున్నారు. ఎంతో నమ్మకంతో విడుదల చేసిన ఈ లైగర్ కూడా మొదటి రోజు నుండే ప్లాప్ టాక్ అనేది తెచ్చుకుంది. దాంతో భారీగా నష్ట పోయాను అని వరంగల్ శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీతో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్..!

పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

Visitors Are Also Reading