ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏదంటే ముంబై ఇండియన్స్ పేరు చెబుతారు. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరు. జట్టును అయిదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ కే దక్కింది. 2013లో ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ తొలి సీజన్ లోనే టైటిల్ అందించి తానేంటో నిరూపించుకున్నాడు. 11 సీజన్లలో సారథ్యం వహించి అందులో ఐదుసార్లు తన జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు.
Advertisement
ముంబై ఇండియన్స్ జట్టు తరపున 163 మ్యాచ్లకు సారధ్యం వహించగా.. 91 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. 68 మ్యాచ్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్లో ఫలితం రాలేదు. రోహిత్ సారథ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లో టైటిల్ విజేతగా నిలిచింది. అసలు ముంబై ఇండియన్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరగడానికి ప్రధానకారణం రోహిత్ శర్మ అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ను ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఐదుసార్లు కప్పు అందించిన వీరుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో హార్దిక్ పాండ్యాను కూడా వదలడం లేదు. హార్దిక్ ను కటప్ తో పోలుస్తున్నారు.
Advertisement
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారిగా బయట కనిపించాడు. ముంబై ఎయిర్పోర్టులో హార్దిక్ ను చూసిన రోహిత్ ఫ్యాన్స్ ట్రోల్స్ కు గురిపడ్డారు. “ముంబై కా రాజా రోహిత్ శర్మ” అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ టైంలో పాండ్యా సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనప్పటికి ఇలా చేయడం సరికాదు అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.