Home » Big boss6: చలాకి చంటి ఇన్ని రోజులు హౌస్ లో ఉండి ఎంత సంపాదించారంటే..?

Big boss6: చలాకి చంటి ఇన్ని రోజులు హౌస్ లో ఉండి ఎంత సంపాదించారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నాగార్జున.. ఆతర్వాత కంటెస్టెంట్ లు..ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని చాలా సక్సెస్ఫుల్ రియాలిటీ షో గా ముందుకు వెళుతోంది.. ఈ బిగ్ బాస్ ద్వారా జరిగిన ఐదు సీజన్లలో ఎంతోమంది కంటెస్టెంట్ లు పాల్గొని మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇతర కార్యక్రమాల్లో చేస్తూ బిజీగా ఉంటున్నారు. అలా బిగ్ బాస్ ఎందరికో జీవితాన్ని కూడా ఇచ్చిందని చెప్పవచ్చు.. ఈ బిగ్ బాస్ ను ఎంత మంది ప్రేక్షకులు ఇష్టపడతారో, ఈ షోను ఖండించేవారు కూడా లేకపోలేదు.. అయితే బిగ్ బాస్ నుండి వారం వారం కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించడం చాలా కష్టం..

బిగ్ బాస్6:  ఓటింగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి మీ అభిమాన కంటెస్టెంట్ కి ఓట్ చెయ్యండి  – Bigg Boss Telugu voting

Advertisement

also read;నటుడు నూతన్ ప్రసాద్ గురించి ఈ ఒక్క విషయం మీకు తెలుసా..?

Advertisement

అలాంటి బిగ్ బాస్ నుండి రెండో వారం నేహా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. కానీ ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోయింది. మరో కంటెస్టెంట్ చలాకి చంటి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని అస్సలు ఊహించలేదు. కానీ అనూహ్యంగా ఆయన కూడా బయటకు వచ్చేశారు.. కట్ చేస్తే చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ లో 5 వారాలు ఉన్నారు.. మరి ఆయన ఇన్ని రోజులు ఉన్నా అందుకు ఎంత సంపాదించారు.. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు..

అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం.. అయితే బిగ్ బాస్ హౌస్ లో చలాకి చంటి చివరివరకు ఉంటారని అందరూ భావించారు. ఎందుకంటే కమెడియన్స్ గురించి బయట జనాలకు తెలుసు కాబట్టి. ఇందులో చలాకి చంటికి చాలా క్రేజ్ ఉంది.. ఈ క్రేజ్ తో ఆయన హౌస్ లోనే కొనసాగుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా చలాకి చంటి ఎలిమినేట్ అయ్యారు. మరి చలాకి చంటి ఐదు వారాలకు గాను దాదాపుగా ఐదు లక్షలకు పైనే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆయన బిగ్బాస్ లో ఉన్న ఈ ఐదు వారాలు తన కెరియర్ కు ఎంతగా ఉపయోగపడతాయో చూడాలి.

 

also read;

Visitors Are Also Reading