Home » Bichagadu 2 : ఓటీటీలోకి ‘బిచ్చగాడు-2’ మూవీ…. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!

Bichagadu 2 : ఓటీటీలోకి ‘బిచ్చగాడు-2’ మూవీ…. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!

by Bunty
Ad

 

Bichagadu 2 : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని గురించి తెలియని వారండరు. తమిళంలో విజయ్ ఆంటోని… చాలా పాపులర్ అయ్యారు. ఇక విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో అతడు నటించిన సరికొత్త చిత్రం బిచ్చగాడు 2. 2016 లో విడుదలైన బిచ్చగాడు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది.

Bichagadu 2 OTT

బిచ్చగాడు 2 సీక్వెల్ ను తోలుత భాగం, మెట్రోలాంటి సూపర్ హిట్ అందించిన ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా… అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై అతడే నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement

విజయ్ ఆంటోనీ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు అంటున్నారు. థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తున్న బిచ్చగాడు-2 మూవీ ఓటిటి హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. జూన్ నెల 23వ తేదీన బిచ్చగాడు ఓటిటిలో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Visitors Are Also Reading