Home » ప‌వ‌న్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్… భీమ్లానాయ‌క్ డేట్ ఫిక్స్..!

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్… భీమ్లానాయ‌క్ డేట్ ఫిక్స్..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా న‌టించిన సినిమా భీమ్లా నాయ‌క్. ఈ సినిమాలో రానా కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల వాయిదా పండింది. అయితే ఈ సినిమాను ఈనెల 25న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని చిత్ర యూనిట్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈ నెల 25న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

Advertisement

Bheemla nayak

Advertisement

ఈ సంధ‌ర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను కూడా విడుద‌ల చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో ప‌వ‌న్ కల్యాన్ కు జోడీగా నిత్యా మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా రానా కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అంతే కాకుండా ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు అందించారు. ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ సినిమా మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం కు రీమేక్ గా తెర‌కెక్కింది.

Visitors Are Also Reading