Home » భీమ్లా నాయక్ సంక్రాంతి ట్రీట్…పవర్ ఫుల్ లుక్ లో పవన్, మాస్ లుక్ లో రానా…!

భీమ్లా నాయక్ సంక్రాంతి ట్రీట్…పవర్ ఫుల్ లుక్ లో పవన్, మాస్ లుక్ లో రానా…!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ కు భార్యగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Bheemla nayak

Advertisement

అదేవిధంగా రానాకు జోడీగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ సినిమాల విడుదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక సినిమాను చిత్ర యూనిట్ సంక్రాంతికి విడుదల చేయలేక పోయింది.

Advertisement

కానీ అభిమానుల కోసం సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా రానా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీని చిత్రం మరోసారి ప్రకటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇద్దరి మధ్య నెలకొన్న ఈగోల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading