Home » బిగ్ బ్రేకింగ్ : ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా

బిగ్ బ్రేకింగ్ : ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా

by Bunty
Ad

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్‌, వెంక‌టేష్ న‌టించిన ఎఫ్ 3 సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఈ విష‌యాన్ని నిర్మాత దిల్ రాజ్ చెప్పారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… దిల్ రాజు మాట్లాడుతూ… సంక్రాంతి సినిమాల విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాము. రాధేశ్యాం, ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమాలు.. ఈ సంక్రాంతి కి విడుదల అవుతాయి.

Advertisement

Advertisement

కానీ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్ల నాయక్ మరియు విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్ మూడు సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఒకేసారి నాలుగు పాన్ ఇండియా మూవీస్ విడుదల అయితే చిత్ర పరిశ్రమలో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పాన్ ఇండియా మూవీ వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆ చిత్ర నిర్మాతలు కూడా అంగీకరించారు. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ సినిమా ఏప్రిల్ 29కి మారింది… జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కు రానుందని నిర్మాత దిల్ రాజు స్ప‌ష్టం చేశారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

Visitors Are Also Reading