Home » వాడు చెప్పిందే చేశాడు.. రాజమౌళి పై భానుచందర్ సంచలన వ్యాఖ్యలు..!!

వాడు చెప్పిందే చేశాడు.. రాజమౌళి పై భానుచందర్ సంచలన వ్యాఖ్యలు..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

రాజమౌళిని చిలిపిగా జక్కన్న అని పిలుస్తుంటారు. ఆయన సినిమా తీశాడు అంటే బాక్సాఫీస్ వద్ద భూకంపం వస్తుంది. అంటే సినిమాలు తీయడంలో అంతటి ఘనుడు. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీసి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీని ఎల్లలు దాటించారు రాజమౌళి. బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా జక్కన్న పేరు మొగిపోయింది. ఇండస్ట్రీ అంటేనే జయాపజయాలు అనేవి ఉంటాయి. కానీ రాజమౌళి సినీ జీవితంలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా లేదంటే ఎంతటి గానుడో మనం అర్థం చేసుకోవచ్చు. మార్చి 25వ తేదీన విడుదలైన త్రిబుల్ ఆర్ మూవీతో దేశవ్యాప్తంగా ఆయన పేరు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఒక సీనియర్ నటుడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి గొప్ప స్థాయికి వస్తాడని పుష్కరకాలం కిందే ఊహించాను అని, ఇప్పుడు అది నిజం అయిందని సీనియర్ నటుడు భానుచందర్ తెలియజేశారు.

Advertisement

Advertisement

ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భానుచందర్ తమిళ్, తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసి మంచి పేరు సంపాదించారు. ఆయన ముఖ్యంగా యాక్షన్ సినిమా లో భానుచందర్ కు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆయన ఎన్నో సంచలనమైన చిత్రాలలో నటించారు సంగీత దర్శకుడిగా నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ తరుణంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జక్కన్న గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతారని 19 ఏళ్ల కింద చెప్పానని ఇప్పుడు అదే జరిగింది. సింహాద్రి సినిమా చేసే సమయంలోనే ఈ మాట ఆయనతో అన్నాను.

అంతే కాకుండా ఆయన దగ్గర నుంచి సినిమాలు ఏ విధంగా ప్రమోట్ చేయాలి అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్ లో పెట్టి వండర్ఫుల్ చాక్లెట్ అని అమ్మేయగలడు. ఇలాంటి టాలెంట్ ఎంతమందికి ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కూడా ఉండాలి. ఇది రాజమౌళి లో ఎక్కువగా ఉందని ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే భానుచందర్ ఆయన గురించి కూడా చెప్పుకున్నారు. ఆయన ఒకప్పుడు dra* కు అలవాటు పడ్డానని దాని నుంచి బయటపడడానికి ఎన్నో కష్టాలు పడ్డాను అని, మార్షల్ ఆర్ట్స్ నన్ను దాన్నుంచి బయట పడేసిందని సంచలన విషయాలు బయట పెట్టారు.

ALSO READ;

APRIL 27th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

చీపురు వారంలో ఈ రోజు కొంటే ఇంట్లో కనకవర్షమే.. ఏంటో చూడండి..!!

 

Visitors Are Also Reading