Home » ‘భ‌ళా తంద‌నాన’ టీజ‌ర్ వ‌చ్చేసింది..!

‘భ‌ళా తంద‌నాన’ టీజ‌ర్ వ‌చ్చేసింది..!

by Anji
Ad

మొద‌టి నుంచి శ్రీ‌విష్ణు విభిన్న క‌థ‌ల‌కు, పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తూ ఉన్నాడు. సినిమా టైటిల్స్ కూడా చాలా డిఫ‌రెంట్‌గా ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఈ మ‌ధ్య ఆయ‌న నుంచి వ‌చ్చిన రాజ రాజ చోర హిట్ టాక్ తెచ్చుకున్న‌ది. ఇటీవ‌ల వ‌చ్చిన అర్జున ఫ‌ల్గుణ హిట్ కాక‌పోయినా.. మంచి ప్ర‌య‌త్నం అనిపించుకుంది. తాజాగా ఆయ‌న నుంచి మ‌రొక సినిమా రావ‌డానికి రెడి అవుతోంది. ఆ సినిమా భ‌ళా తంద‌నాన వారాహి బ్యాన‌ర్ పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ర‌జినీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ సినిమాకు చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Bhala Thandhanana Teaser: A thrilling entertainer - TeluguBulletin.com

Advertisement

Advertisement

చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకునేవిధంగా ఉంది. మ‌ణిశ‌ర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. టీజ‌ర్‌లో శ్రీ‌విష్ణును మునుపెన్న‌డూ చూడ‌ని అవ‌తార్‌ను చూపించారు. ఇందులో శ్రీ‌విష్ణు క్రైమ్ రిపోర్ట‌ర్‌గా న‌టించాడు. అమాయ‌క‌ర‌మైన భిన్న‌మైన కోణంలో ఆలోచించే వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడు. క్యాథ‌రిన్ ట్రెస్సా కూడా రిపోర్ట‌ర్గా క‌నిపిస్తుంది.

లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… 'భళా తందనాన' టీజర్

శ్రీ విష్ణు అవినీతి ప‌రుడు అయిన రాజ‌కీయ నాయ‌కుడికి వ్య‌తిరేకంగా ఉండే సాధార‌ణ వ్య‌క్తిగా కూడా టీజ‌ర్ చూపిస్తోంది. హ‌వాలా మోసాల చుట్టూ క‌థ తిరుగుతుంద‌ని తెలుస్తోంది. టీజ‌ర్‌ను బ‌ట్టి చూస్తే.. భ‌ళా తంద‌నాన డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో కూడిన యాఓన్ థ్రిల్ల‌ర్‌. కేజీఎఫ్ ఫేమ్ రామ‌చంద్ర‌రాజు ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించారు. వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ‌నివాస్‌రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, స‌త్య పోసారి కృష్న‌ముర‌ళి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల అవ్వ‌నుంది.

Visitors Are Also Reading