Home » భాగ్య‌ల‌క్ష్మీ బంప‌ర్ డ్రా…అప్ప‌ట్లో ప్ర‌భుత్వ‌మే దీన్ని నిర్వ‌హించేది!

భాగ్య‌ల‌క్ష్మీ బంప‌ర్ డ్రా…అప్ప‌ట్లో ప్ర‌భుత్వ‌మే దీన్ని నిర్వ‌హించేది!

by Azhar
Ad

భాగ్య‌లక్ష్మీ బంప‌ర్ డ్రా ….అప్ప‌ట్లో ప్ర‌తి ఒక్క‌రూ ఒక్క లాట‌రీ టికెట్ కొని డ్రా కోసం ఎదురుచూస్తుండేవారు! కొంత‌మందైతే వంద‌ల్లో లాట‌రీ టికెట్లు కొని త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేవారు. అప్ప‌ట్లో ఈ లాట‌రీ వ్య‌వ‌హారాన్ని స్వ‌యంగా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించేది. దీని కొర‌కు IAS స్థాయి అధికారిని క‌మీష‌న‌ర్ గా నియ‌మించేవారు. ఆ అధికారి లాట‌రీల‌తో పాటు చిన్న‌మొత్తాల పొదుపును కూడా చూసుకునేవారు. 1968 లాట‌రీ యాక్ట్ ప్ర‌కారం ఈ భాగ్య‌లక్ష్మీ బంప‌ర్ డ్రాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రారంభించారు.

Advertisement

రూపాయికే లాట‌రీ టికెట్, 15 రోజుల‌కొక‌సారి డ్రా, ముగ్గురికి 1 ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తితో పాటు చాలా ర‌కాల బ‌హుమ‌తులు ఉండేవి. దానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు ఇక్క‌డి ఫోటోలో చూడొచ్చు.

Advertisement

చాలా మంది ఈ లాట‌రీకి అల‌వాటు ప‌డి., తాము సంపాధించిన డ‌బ్బునంతా ఈ లాట‌రీల పేరుతో వృథా చేసుకుంటున్నార‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు ఉద్య‌మించిన త‌ర్వాత విష‌యం హైకోర్ట్ కు వెళ్లింది. హైకోర్ట్ తీర్పుతో 15 March, 1999 నుండి ఈ లాట‌రీల‌ను నిర్వ‌హించ‌డం ఆపేశారు.

ఇప్ప‌టికీ దేశంలోని 13 రాష్ట్రాల్లో ఈ త‌ర‌హా లాట‌రీలు న‌డుస్తున్నాయి. కేర‌ళ‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ , నాగాలాండ్ రాష్ట్రాల లాట‌రీల‌కు మంచి రెస్పాన్స్ ఉంటుంది.

Visitors Are Also Reading