భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా ….అప్పట్లో ప్రతి ఒక్కరూ ఒక్క లాటరీ టికెట్ కొని డ్రా కోసం ఎదురుచూస్తుండేవారు! కొంతమందైతే వందల్లో లాటరీ టికెట్లు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. అప్పట్లో ఈ లాటరీ వ్యవహారాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేది. దీని కొరకు IAS స్థాయి అధికారిని కమీషనర్ గా నియమించేవారు. ఆ అధికారి లాటరీలతో పాటు చిన్నమొత్తాల పొదుపును కూడా చూసుకునేవారు. 1968 లాటరీ యాక్ట్ ప్రకారం ఈ భాగ్యలక్ష్మీ బంపర్ డ్రాను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు.
Advertisement
రూపాయికే లాటరీ టికెట్, 15 రోజులకొకసారి డ్రా, ముగ్గురికి 1 లక్ష రూపాయల బహుమతితో పాటు చాలా రకాల బహుమతులు ఉండేవి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడి ఫోటోలో చూడొచ్చు.
Advertisement
చాలా మంది ఈ లాటరీకి అలవాటు పడి., తాము సంపాధించిన డబ్బునంతా ఈ లాటరీల పేరుతో వృథా చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు ఉద్యమించిన తర్వాత విషయం హైకోర్ట్ కు వెళ్లింది. హైకోర్ట్ తీర్పుతో 15 March, 1999 నుండి ఈ లాటరీలను నిర్వహించడం ఆపేశారు.
ఇప్పటికీ దేశంలోని 13 రాష్ట్రాల్లో ఈ తరహా లాటరీలు నడుస్తున్నాయి. కేరళ, అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ రాష్ట్రాల లాటరీలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది.