Bhagavanth Kesari Review : బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీలా, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ ముఖ్యపాత్రను పోషించారు. దసరా కానుకగా ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య, రావిపూడి కలయికలో వచ్చిన మొదటి సినిమా కావడంతో ముందు నుంచి ‘భగవంత్ కేసరి’పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య నటించిన చిత్రమిది.
కథ మరియు వివరణ :
Advertisement
బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’ కథ విషయానికి వస్తే, తెలంగాణకు చెందిన వ్యక్తి భగవంత్ కేసరి (బాలకృష్ణ). నేలకొండపల్లి ఆయన ఊరు. అక్కడే గిరిజన ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. చాలా మొండివాడు. తన వాళ్లకు ఏదైనా అయితే మాత్రం అసలు తట్టుకోలేడు. తన సొంత వాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మరోవైపు తన కూతురును ఆర్మీకి పంపించాలనేది భగవంత్ కేసరి కల. కానీ…. తన కూతురుకు మాత్రం ఆర్మీలోకి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. తన కూతురుగా శ్రీలీలా (విజ్జి పాప) నటించింది. మరోవైపు తన కూతురు విజ్జి పాప వల్ల కొందరు రౌడీలు, రాజకీయ నాయకులతో భగవంత్ కేసరి గొడవ పెట్టుకుంటాడు.
Advertisement
అసలు రాజకీయ నాయకులకు, రౌడీలకు తన కూతురుకు ఏంటి సంబంధం? చివరకు తన కూతురు ఆర్మీకి వెళ్లిందా? ఆ రౌడీల భారీ నుంచి తన కూతురును బాలకృష్ణ ఎలా తప్పించారు? తన భార్యగా నటించిన కాజల్ అగర్వాల్ (కాత్యాయిని) ఎవరు? ఆమెకు, కేసరికి ఎలా పరిచయం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే. అయితే… బాలయ్య బాబుకి, శ్రీ లీలకి మధ్య వచ్చే కొన్ని సెంటిమెంటల్ సీల్స్ కొంతవరకు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయినప్పటికీ వాటిని బాగా తీసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే ఈ సినిమాని చాలా బాగా తీసినప్పటికీ ఈ సినిమా రొటీన్ స్టోరీగా సాగుతుందని చెప్పాలి. అలాగే దీంట్లో పెద్దగా తెలుసుకోవాల్సిన కొత్త విషయాలు మాత్రం ఏమీ లేవు. డైరెక్టర్ గా అనిల్ రావిపూడి కొత్త పంతాలో సినిమా తీసినప్పటికీ పెద్దగా కొత్తదనం అయితే ఏమీ చూపించలేదు.
పాజిటివ్ పాయింట్స్
బాలయ్య
శ్రీ లీల
తెలంగాణ భాష
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
సాగదీత
రేటింగ్ 3/5
ఇవి కూడా చదవండి
- అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత
- రోజాకు ఇష్టమైన వంటకాలు ఇవే..మాంసం లేనిదే ముద్ద దిగదు ?
- NED vs SA : ఫుడ్ డెలివరీ బాయ్ చేతులో చిత్తు అయిన సఫారీలు !