Home » యోధుడు భగత్ సింగ్ తన తండ్రికి రాసిన చివరి లేఖ.. చూస్తే కన్నీరు ఆగదు..!!

యోధుడు భగత్ సింగ్ తన తండ్రికి రాసిన చివరి లేఖ.. చూస్తే కన్నీరు ఆగదు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

పూజ్యులైన తండ్రి గారికి,

నన్ను ఉరికంభం నుంచి తప్పించడం కోసం కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా నేను సంతోషపడతానేమో కానీ, ఈ దేశ పౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకుగా పుట్టినందుకు మీ ఆశల్ని ఆకాంక్షల్ని గౌరవిస్తాను. కానీ నీ కన్నా ముందు ఈ మాతృభూమి ఋణం తీర్చుకునే హక్కు లేదంటారా..? నేను బ్రిటిష్ వాళ్లపై చేసిన దాడిని నేరంగా భావించడం లేదు. అందుకే నేను ఇప్పుడు నిర్దోషినని నిరూపించుకునేందుకు కోర్ట్ లో వాదించేందుకు అంగీకరించలేదు. నాన్న..!!

Advertisement

 

నా జీవితం ఈ దేశం విలువైనది కాదు. అసలు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికి సమర్పణం చేయాలని నమ్ముతాను కూడా. అందుకు ఎన్ని ప్రతిఘటనలైన ఎదుర్కోవాలి.ఎలాంటి ప్రగతి కోసం నిలబడే వ్యక్తి అయినా కాలం తీరిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి. నాకు తెలుసు నా మెడకు ఉరితాడు బిగించడమే. నా జీవితంలో ఆఖరి క్షణం అవుతుందని, అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ, దయనీయం కాదు..

Advertisement

 

ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి పారితోషికం ఆశించకుండా, నా జీవితాన్ని దేశ స్వతంత్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. ఈ మానవాళికి సేవ చేయడానికి పీడితులకు విముక్తిని కల్పించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే, ఈ నవయుగానికి నాంది ప్రస్తావన జరుగుతుంది నాన్న..!! నా మరణాంతరం త్యాగమనే సుగుణం ముందు తరాలకు అందేలా చూడండి. ఎలాంటి పరీక్షా సమయంలోనైనా మహోత్తరమైన మానసిక గృహత్వాన్ని సడలనీయకుండా చూసుకోమని ప్రోత్సహించండి .. ఇక సెలవు..

ఇట్లు
మీ ప్రియ పుత్రుడు
భగత్ సింగ్.

also read:మీ మూత్రాశయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 4చిట్కాలు పాటించాల్సిందే..?

Visitors Are Also Reading