సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అదే రేంజ్ లో సీరయల్స్ కు సైతం క్రేజ్ ఉంటుదనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాష ఏదైనా సీరియల్స్ కు మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ముఖ్యంగా సీరియల్స్ కు మహిళా అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక కొన్ని సీరియల్స్ అయితే సంవత్సరాల తరబడి ప్రసారం అవుతూనే ఉంటాయి కానీ అభిమానులు ఏమాత్రం విసుగు చెందకుండా చూస్తుంటారు. అంతే కాకుండా సీరియల్స్ లో రోజుకో ట్విస్ట్ ఉంటుంది కాబట్టి మరుసటి రోజు ఎపిసోడ్ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తుంటారు.
Advertisement
ఇక తెలుగులో ఈటీలో వచ్చే సీరియల్స్ కు అప్పట్లో తెగ క్రేజ్ ఉండేది. ఈ ఛానల్ లో వచ్చిన ఎన్నో సీరియల్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఆ సీరియల్స్ లో నటించిన హీరోయిన్లను సైతం ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఇక ఈటీవీలో వచ్చిన సీరియల్స్ లో లేడీ డిటెక్టివ్ సీరియల్ తెగ పాపులర్ అయ్యింది. ప్రతి మంగళవారం ఈ సీరియల్ ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో నటించిన ఉత్తర ఎంతో ఫేమస్ అయ్యింది. కానీ ఈ సీరియల్ తరవాత ఉత్తర పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేసింది.
Advertisement
ఇక ఈటీవీలో స్నేహ అనే సీరియల్ కూడా ప్రసారమయ్యేది. ఈ సీరియల్ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ హీరోయిన్ కూడా ఎంతో పేరు సంపాదించుకుంది. ఇక ఈటీవీలో ప్రసారమైన మరో సూపర్ హిట్ సీరియల్ అన్వేషిత. ఈ సీరియల్ లో అచ్చుత్ యమున ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సీరియల్ కు ఏకంగా ఎనిమిది నంది అవార్డులు వచ్చాయి.
ఆ తరవాత అంతరంగాలు సీరియల్ కూడా ఎంతో పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ కు రామోజీ రావు కుమారుడు సుమన్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా రామోజీరావు ఈ సీరియల్ ను నిర్మించారు. ఈ సీరియల్ లో నటించిన కల్పన సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంది. ఇక ఈ సీరియల్ లో నటించిన మహర్షి, జ్యోతి రెడ్డి నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా మహర్షి 175 సీరియల్స్ లో నటించి అలరించారు.