Home » గీతాంజ‌లి, శివ‌ స‌హా మిస్ కాకుండా చూడాల్సిన 10 నాగార్జున సినిమాలు ఇవే..!

గీతాంజ‌లి, శివ‌ స‌హా మిస్ కాకుండా చూడాల్సిన 10 నాగార్జున సినిమాలు ఇవే..!

by AJAY
Ad

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగార్జున. తండ్రి వారసత్వాన్ని ఇండస్ట్రీలో నాగార్జున కొనసాగించారు. రొమాంటిక్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలతో అమ్మాయిలకు మన్మధుడిగా నాగార్జున మారిపోయారు. ఇప్పటికీ అదే అందం జోష్ తో నాగార్జున సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. ఇక నాగార్జునను కెరీర్లో స్టార్ గా నిలబెట్టిన‌ సినిమాలు కొన్ని ఉన్నాయి.

Advertisement

ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం… 1987లో నాగార్జున దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన మజ్ను సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే నాగార్జునకు టాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జానకి రాముడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాతో నాగార్జున ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయ్యారు. నాగార్జున కెరీర్ లోనే టాప్ సినిమాల్లో ఒకటి గీతాంజలి. ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు.

Also Read: కాంతార సినిమాలో నిప్పులు కక్కుతున్న ఆ కళ్ళు ఎవరివో తెలుసా…? ఆ కళ్ళ వెనక ఉన్న కథ ఏంటంటే…?

ninne pelladatha movie

ninne pelladatha movie

ఈ చిత్రంతో నాగార్జున పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలలో శివ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించగా అప్పట్లో యూత్ ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. నాగార్జున కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అదేవిధంగా నాగార్జున కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఆ తర్వాత వచ్చిన సినిమా అల్లరి ప్రియుడు.

Advertisement

ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున హలో బ్రదర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారమైనా మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. నాగార్జునను రొమాంటిక్ స్టార్ గా నిలబెట్టిన సినిమా నిన్నే పెళ్ళాడుతా…. ఈ సినిమా అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ ను మెప్పించింది.

nagarjuna mass movie

ఈ సినిమా టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కె విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా మన్మధుడు…. ఈ సినిమాతోనే నాగ్ కు మన్మధుడు అనే బిరుదు వచ్చింది.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నాగార్జున ఒకే రకమైన సినిమాలలో కాకుండా భక్తి రస చిత్రాలలో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు నాగార్జున లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

Also Read:  ఫిల్మ్ ఇండ‌స్ట్రీ చెన్నై నుండి హైద‌రాబాద్ ఎలా వ‌చ్చిందో తెలుసా…ఏఎన్ఆర్ ఏం చేశారంటే..?

Visitors Are Also Reading