Best Motivational Telugu Quotes: సాధారణంగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కొన్నిరోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎవరికీ లేనన్నీ కష్టాలు మనకే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జీవితం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంటుంది. కొందరూ వయస్సు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి వయస్సు పెరిగే కొద్ది కష్టాలు పెరుగుతాయనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కానీ కొందరి విషయంలో మాత్రం అలా జరుగదు. Find Telugu Quotes అయితే వయస్సు పెరుగుతుంటే మనం ఎన్నో గుణపాఠాలు, అనుభవాలను మాత్రం తప్పకుండా నేర్చుకుంటూ ముందుకెళ్తాం.
Advertisement
తెలుగు కొటేషన్స్
ఈ నేపథ్యంలోనే మన జీవితంలో కొత్త విషయాలను మనం నేర్చుకోవడానికి.. అదేవిధంగా భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మనకు స్ఫూర్తి తప్పకుండా అవసరం. అలాంటి సమయంలో జీవితం యొక్క విలువను.. మనలను మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని సానుకూలతను పెంపొందించుకోవడం అవసరం. ఈ అవసరాన్ని బట్టి గుర్తు చేసుకునే మంచి లైఫ్ కొటేషన్స్.. నిత్యం ఇలాంటి తెలుగు కొటేషన్లు చదువుకోవడంతో పాటు, వాటిని మనం షేర్ చేసుకోవడం వల్ల మన జీవితంలో సరికొత్త ఆనందం, స్ఫూర్తి కలుగుతుంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ Telugu Quotationsతెలుగు కొటేషన్స్ గురించి తెలుసుకోండి. నలుగురికి షేర్ చేయండి.
ఇవి కూడా చదవండి: Swami Vivekananda Quotes, Quotations in Telugu: విజయానికి స్ఫూర్తి.. వివేకానంద సూక్తులు
Best Motivational and Inspirational Telugu Quotes, తెలుగు కొటేషన్స్
- జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం.
- ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా, చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతారు. అందుకే నచ్చినవన్ని చేసేయాలి.
- తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.
- సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేవిధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా.
- జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు.
- తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు.
- సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు..
- జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణమంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది.
- ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి.
Also Read: Vinyaka Chavithi Wishes 2023 and Quotes Telugu
Advertisement
లైఫ్ కొటేషన్స్ తెలుగు
- మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
- మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు.. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికీ జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటిని ఆలోచించండి.
- ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్న మాట.
- సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యంకానీ విషయం అంటూ ఏది లేదు. మనకు కావాల్సింది అల్లా పాజిటివ్ గా ఆలోచించి ముందడుగు వేయాలి.
- ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్ గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి.
- ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్ గా కొనసాగించడం లేదా నెగిటివ్ గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం.
- జీవితంలో మనం ఎవ్వరినీ కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది.
లైఫ్ కొటేషన్స్ తెలుగు
Telugu new quotations
jeevitham quotes in telugu
Also Read: Happy New Year Wishes, Images, Quotes, Greetings, Status in Telugu 2023