Telugu News » ఏ రాశి వారు ఏ ఉద్యోగం చేస్తే మంచిదో తెలుసా..?

ఏ రాశి వారు ఏ ఉద్యోగం చేస్తే మంచిదో తెలుసా..?

by Manohar Reddy Mano
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో చాలా రకాలైన ఉద్యోగాలు అనేవి అందుబాటులో ఉంటున్నాయి. ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే.. అసలు అది అంటే ఏంటో కూడా తెలియని ఉద్యోగం ఇప్పుడు ఉంటుంది. ఆ ఉద్యోగానికి పోటీ కూడా బాగానే ఉంటుంది. అందువల్ల యువత చాలా మంది ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతున్నారు. అయితే మన ఇండియాలో జాతకాలను.. రాశులను, గ్రహాలను బాగా నమ్ముతారు. కొన్ని ముఖ్యమైన విషయాలను దాని ప్రకారమే చేస్తారు. ఇక ఇప్పుడు మనం ఏ రాశి వ్యక్తి… ఏ రకమైన ఉద్యోగం చేస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం..!
రాశుల్లో మొదటిది మేషం. ఈ రాశి వ్యక్తులు పోలీస్, ఆర్మీ, ఫైర్ డిపార్ట్మెంట్, సర్జన్ లేదా ఇంజనీర్ ఉంద్యోగం చేయవచ్చు. ఇక వృషభ రాశి వారు ఫైనాన్షియల్ అడ్వైజర్, ఫ్యాషన్ డిజైనర్, లాయర్, మేనేజర్ లేదా ల్యాండ్‌స్కేపర్ ఉంద్యోగం చేస్తే బాగుంటుంది. మిథున రాశి వారు టీచర్, ఇంటర్‌ప్రెటర్, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ లేదా మీడియాలో పని చేయాలి. కర్కాటక రాశి వారు కంటెంట్ మేనేజ్‌మెంట్, టీచింగ్, నర్సింగ్, క్యాటరింగ్, సోషల్ వర్క్ లేదా థెరపీ ఉద్యోగం చేయాలి. ఇక సింహ రాశి వారికి యాక్టర్, డిజైనర్, గవర్నమెంట్, ఈవెంట్ మేనేజర్, మార్కెటర్ ఉద్యోగాలకు సరిపోతారు. అలాగే పరిశోధన, పెట్టుబడి, హార్డ్ వేర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు కన్య రాశి వారికి సరిపోతాయి.
తులా రాశి వారు అయితే ఎన్వాయిర్మెంట్, న్యాయ విశ్లేషకుడు, వైద్య వృత్తి.. లేదా దౌత్యవేత్తగా పని చేస్తే మంచిది.  సైకాలజిస్ట్, టీచర్, శాస్త్రవేత్త, ఇంజినీర్ వంటిని వృశ్చికం వారికి సరిపోతాయి. ధనుస్సు రాశికి ఆఫిసర్స్, ఇంస్ట్రుక్టర్స్, రెసెర్చ్ర్స్, ట్రావెల్ ఏజెంట్స్ వంటివి బాగుంటాయి. బ్యాంకింగ్, అకౌంటింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు మకరం వారికి… ఇన్స్ట్రక్టర్, శాస్త్రవేత్త, డేటా అనలిస్ట్ డిజైనర్, మీడియేటర్ వంటివి కుంభం వారికి… సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, నర్సింగ్, థెరపిస్ట్ వంటి ఉద్యోగాలు మీనరాశికి సెట్ అవుతాయి.
ఇవి కూడా చదవండి :

You may also like