Telugu News » వెండి పట్టీలు ధ‌రించ‌డం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

వెండి పట్టీలు ధ‌రించ‌డం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

by Anji

ముఖ్యంగా ఆడపిల్ల పుడితే చాలు ఆమె కోసం మొదటగా ఏదైనా కొనాలి అని అనుకుంటాం. ఆ లిస్టులో వెండి పట్టీలే తొలి  ప్లేస్ లో ఉంటాయి. అవి పెట్టుకొని చిన్నారులు అలా నడుస్తూ ఉంటే.. గజ్జెలు ఘల్లు ఘల్లు మంటుంటే ఇంట్లో వ‌చ్చే ఆ క‌ళే వేరు. అందుకే చిన్న పిల్ల‌ల‌కు అప్పుడ‌ప్పుడే న‌డుస్తుంటే.. గ‌జ్జెలు ఎక్కువ‌గా ఉండే వెండి ప‌ట్టీల‌ను పెట్టి మురిసిపోతుంటారు. అయితే భార‌తీయ సంస్కృతి సాంప్ర‌దాయంలో వెండి ప‌ట్టీలను ధ‌రించ‌డం ఒక భాగంగా మారింది. అయితే ఈ ప‌ట్టీలు ఎందుకు పెట్టుకుంటారు అని అడిగితే మీరు ఏమి స‌మాధానం చెబుతారు. కాళ్ల అందం కోస‌మ‌నేనా..? కాన ఈ వెండి ప‌ట్టీలు కాళ్ల‌కు అందాన్నే కాదు వారి ఆరోగ్యాన్ని కాపాడ‌టానికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మీకు తెలుసా..? అవును వీటిని ధ‌రించ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Silver Anklets : కాళ్ళకు వెండి పట్టీలు మాత్రమే ఎందుకు ధరించాలంటే?.. |Why  wear only silver straps on the legs? ..

కాళ్ల‌లో త‌ర‌చుగా వ‌చ్చే నొప్పుల‌ను తిమ్మిరి, వ‌ణుకు వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌ట్టీల‌తో చెక్ పెట్టొచ్చు. అవును వెండి ప‌ట్టీలు పెట్టుకున్న వారికి కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి స‌మ‌స్య‌లు చాలా త‌క్కువ‌గా వ‌స్తాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ నొప్పుల‌ను త‌గ్గించే గుణం వెండికి ఉంటుంది. అంతేకాదుఅవి పెట్టుకున్న వారికి సానుకూల శ‌క్తిని కూడ పెంచుతాయ‌ట‌.

పట్టీలు Images ☆꧁ itSmeNani ꧂☆ - ShareChat - భారతదేశం యొక్క స్వంత స్వదేశీ  సోషల్ నెట్‌వర్క్

కొంత మంది స్త్రీలు, జ‌న‌నేంద్రియ‌, గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. ఈస‌మ‌స్య‌ల‌కు హార్మోన్ల హెచ్చు, త‌గ్గుద‌ల కూడా కార‌ణం కావ‌చ‌చ్చు. వెండి ఆభ‌ర‌ణాలు చ‌ర్మానికి త‌గిలితే హార్మోన్లు స‌మ‌తుల్యంగా ఉంటాయ‌ట‌. అంతేకాదు నెల‌స‌రి ఇర్రెగ్యుల‌ర్ గా అయ్యే అవ‌కాశం ఉండ‌దు. అదేవిధంగా ఊబ‌కాయం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో కూడా వెండి ఎంతో స‌హాయ పడుతుంది. అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి దూరంగా ఉంచుతుంది.

Unkwon Facts About Golden Anklet For Womens - Telugu Viral News-TeluguStop
చాలా మంది స్త్రీల‌లో ఎక్కువ‌గా క‌నిపించే స‌మ‌స్య పాదం మ‌డ‌మ వాపు రావ‌డం ఈ స‌మ‌స్య వ‌ల్ల మ‌డ‌మ చాలా నొప్పిగా ఉంటుంది. వారు వారి ప‌నుల‌ను స‌రిగ్గా చేసుకోలేరు. ఈ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే వెండి ప‌ట్టీల‌ను ధ‌రిస్తే చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. ఇవి పెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌డ‌మ ద‌గ్గ‌ర బ్ల‌డ్ స‌ర్యూలేష‌న్ బాగాజ‌రుగుతుంది. దాంతో మ‌డ‌మ వాపు, నొప్పి తొంద‌ర‌గా త‌గ్గుతాయి.

Unkwon Facts About Golden Anklet For Womens - Telugu Viral News-TeluguStop

రోగ‌నిరోధ‌క శ‌క్తి, పోష‌క విలువ‌లు ఉన్న ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా మాత్ర‌మే పెరుగుతుంద‌నుకుంటే మ‌నం పొర‌పాటు జ‌రిగిన‌ట్టు. ఎందుకంటే వెండి ఆభ‌ర‌ణాల ద్వారా కూడా మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వెండిలో ఉండే లోహ‌గుణం, మ‌న‌లో ఇమ్యూనిటి ప‌వ‌ర్ పెరిగే విధంగా చేస్తాయి. అందుకే ఇవి కేవ‌లం ఆభ‌ర‌ణాలే కాదు మ‌న‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే అస్త్రాలు కూడా. మ‌న శ‌రీరంపై ఉండే ఆభ‌ర‌ణాలు మ‌న శ‌రీర శ‌క్తిని కొంచెం కూడా వృధా కానీయ్య‌దు. మ‌న శ‌రీర శ‌క్తిని పెంచుతుంది. అందుకే ప‌ట్టీలు ధ‌రించిన ఆడ‌వారు చాలా షార్ప్‌గా చురుగ్గా ఉంటార‌ట‌. వెండీ ప‌ట్టీలు పెట్టుకునే వారిలో దేవుడి భ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని కొంద‌రు విశ్వ‌సిస్తుంటారు.

Visitors Are Also Reading