తులసి ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి దగ్గర పూజ చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. తులసి ఆకుల్ని ఉదయాన్నే ఏమి తినకుండా తీసుకోవడం మంచిది చిన్నవాళ్లు ఏడు ఆకుల వరకు తీసుకోవచ్చు పెద్దవాళ్ళు 50 ఆకుల దాకా తీసుకున్న పర్వాలేదు. ఉదయాన్నే తులసి ఆకుల రసం తీసుకుంటే ఆరోగ్యం కి ఎంతో మేలు కలుగుతుంది తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఆకలి కూడా పెరుగుతుంది. బలం కూడా పెరుగుతుంది. దోమలు నల్లులు బాధలు లేకుండా ఉండాలంటే అడవి తులసి రెమ్మలని మంచానికి కట్టడం మంచిది.
Advertisement
ఇలా చేస్తే దోమలు నల్లులు రావు తులసి రసం నోట్లో ఉండే పుండ్లను కూడా తగ్గిస్తుంది. వేపరసం తులసి రసం కలిపి తీసుకుంటే అంటువ్యాధులు మన దరి చేరవు తులసి గుండె జబ్బులను కూడా నయం చేయగలదు. తులసి దళాలని నీళ్లలో వేసి, ఆ నీటిని తాగడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది తులసి ఆకులు, మిరియాలు, బాదంపప్పు వేసి చూర్ణాన్ని చేసుకుని ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. మానసికంగా బలహీనమైన పిల్లలకి తేనె తులసి రసము ఇస్తే ఎంతో చక్కటి ఫలితం ఉంటుంది.
Advertisement
అలసట పోయి ఉత్సాహం కలగాలంటే తులసి దళాలను తినడం మంచిది. తులసి, అల్లం, తేనె కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. తులసి, పుదీనా, యాలకులు కలిపి తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది తులసి చూర్ణాన్ని 10 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకుంటే మూల వ్యాధి పోతుంది. మజ్జిగతో పాటుగా కూడా దీనిని మీరు తీసుకోవచ్చు. దగ్గు ఉబ్బసంతో బాధపడే వాళ్ళు తెల్ల తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది. కృష్ణ తులసి రసం ని రాత్రిపూట రెండు చుక్కలు చొప్పున మూడు రోజులు తీసుకుంటే రేచీకటి తగ్గిపోతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!