అనేక రోగాలకు మన వంటింట్లోనే పరిష్కారం లభిస్తుంది. మన వంట ఇంట్లో ఉండే దినుసులను సరిగ్గా ఉపయోగించుకుంటే ఏన్నో సమస్యలను తరిమి కొట్టొచ్చు. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం. చాలా మందిలో ఈ సమస్య ఉంటోంది. అయితే.. ఈ సమస్యకి కూడా మీ వంట గదిలోనే పరిష్కారం ఉంది. అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Advertisement
మనం వంటల్లో ఉపయోగించే లవంగాలు, యాలకులు, ఆవాలు, జీలకర్ర, సోంపు గింజలు వంటి దినుసుల వల్ల మన ఆరోగ్య రీత్యా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం సోంపు గింజల వలన కలిగే ఫలితాలు ఏమిటో, ఆడవారికి పీరియడ్స్ సక్రమంగా రావడానికి ఇది ఎలా దోహదం చేస్తుందో తెలుసుకుందాం. తినడానికి తియ్యగా ఉండి, తిన్న తరువాత మింట్ ఫ్లేవర్ లా అనిపించే సోంపు కి చాలా ప్రత్యేకత ఉంది. ఇవి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి గ్యాస్, ఉబ్బరాలను తగ్గిస్తాయి. ఈ గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరంలోని కణాలు దెబ్బతినకుండ చూసుకుంటాయి.
Advertisement
ముఖ్యంగా మహిళలలో పీరియడ్స్ సరిగా రాని వారు వీటిని ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు రెండు స్పూన్ల సోంపు గింజలను నమిలి తింటే వారికి హాయిగా ఉంటుంది. అలాగే మరి కొన్ని రోజులలో రుతుక్రమ సమస్య కూడా సెట్ అవుతుంది. ఏమైనా గర్భాదాన సమస్యలు ఉంటె అవి పరిష్కారం అవుతాయి. అలాగే.. పీరియడ్స్ సమయంలో సోంపు తినడం వలన అధిక రక్త స్రావం తగ్గుతుంది.
మరిన్ని..
క్లీంకారకు చిరంజీవి దంపతులు స్పెషల్ గిప్ట్ అందుకోసమేనా ?
ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?