Home » పుష్ప పై ద‌ళ‌ప‌తి విజ‌య్ ద‌ర్శకుడు ఆస‌క్తికామెంట్స్‌..!

పుష్ప పై ద‌ళ‌ప‌తి విజ‌య్ ద‌ర్శకుడు ఆస‌క్తికామెంట్స్‌..!

by Anji

స్లైల్ స్టార్ అల్లుఅర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన పుష్ప‌ డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై విజ‌యం సాధించింది. ఇప్పుడు ఎక్క‌డ విన్నా పుష్ప సినిమా పాట‌లే వినిపిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా పుష్ప సినిమాలోని డైలాగ్‌లు వినిపిస్తున్నాయి. మ‌రొక వైపు సుకుమార్‌, అల్లుఅర్జున్ కాంబినేష‌న్ లో ఇది వ‌చ్చిన మూడ‌వ చిత్రం కావ‌డం విశేషం. పుష్ప సినిమా భారీ విజ‌య‌మే కాదు.. రికార్డుస్థాయి క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది.

Allu Arjun's performance in Pushpa The Rise impresses Karan Johar, Arjun  Kapoor, Selvaraghavan and others | Entertainment News,The Indian Express

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రంలో బ‌న్నీ స్మ‌గ్ల‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర‌లో అల్లుఅర్జున్‌ క‌న‌బ‌రిచిన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు, సినిమా తార‌లు ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ పుష్ప సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించాడు.

Pushpa Box Office (Hindi): With Over 300% ROI, Allu Arjun Starrer Isn't  Flower, It's Fire At The Ticket Windows!
నెల్స‌న్ దిలీప్ ప్ర‌స్తుతం విజ‌య్ ద‌ళ‌ప‌తి తో బీస్ట్ సినిమాను తెర‌కెక్కిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పుష్ప సినిమా పై ఆయ‌న స్పందిస్తూ.. ఇలాంటి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సొంతం చేసుకోవ‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదన్నారు. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ అద్భుతంగా న‌టించార‌ని.. డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌పై ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చాలా థాంక్యూ నెల్స‌న్ సార్‌ అని రిప్లై ఇచ్చారు.

Pushpa Raj mania everywhere

స్పెష‌ల్‌గా సార్ మీకు నా న‌ట‌న న‌చ్చ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు బ‌న్నీ. మీ డాక్ట‌ర్ సినిమా చాలా బాగుంది అని.. ఈ మ‌ధ్య కాలంలో నాకు న‌చ్చిన సినిమా మీ డాక్ట‌ర్ అంటూ అల్లుఅర్జున్ నెల్స‌న్ చేసిన‌ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. మ‌రొక వైపు పుష్ప సినిమా రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్టు చిత్రం బృందం పేర్కొంటుంది. చూడాలి మ‌రీ రెండో పార్టు షూటింగ్ ఎప్పుడు మొద‌లు పెడుతార‌నేది.


You may also like