తరచూ చికెన్ తింటున్నారా అయితే ఇది మాత్రం తప్పకుండా తెలుసుకోండి. చికెన్, మటన్ ఈ పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరిపోతుంది. ఇటీవల కాలంలో కేవలం కూరగాయలతో సరిపెట్టుకునే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మీరు చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ తింటారా అంటే..? ఏమి మాట్లాడుతున్నారు. మాకు ముక్క లేనిదే ముద్ద దిగదు అని కొందరు క్రేజీ సమాధానం చెబుతుంటారు. ఇలా ప్రతీ ఒక్కరు ఇటీవలి కాలంలో చికెన్ మటన్ బాగా లాగిస్తున్నారు.
Advertisement
Ad
ఇక ముఖ్యంగా ఆదివారాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కేవలం చికెన్, మటన్ మాత్రమే కాదు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారం ఉండాలక్సిందే. మటన్ ధర ఎక్కువగా కావడంతో కాస్త సామాన్యులు ఎక్కువగా మటన్ తినడానికి ఆసక్తి చూపరు. కానీ చికెన్ మాత్రం సామాన్యునికి అందుబాటు ధరలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది చికెన్ తింటున్నారు.
Advertisement
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత చికెన్, మటన్ తినడం అనేది మరింత పెరిగిపోయింది. చికెన్, మటన్ వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్ముతూ ఎంతో మంది తరుచూ ఆహారంలో చికెన్, మటన్ లాంటి ఉండేవిధంగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా చికెన్ అయితే వారంలో నాలుగైదు సార్లు తినాల్సిందే అంటూ ఫిక్స్ అయిపోతుంటారు. ఇక మటన్ కాకుండా చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడే వారు కూడా లేకపోలేదు. చికెన్ తినేటప్పుడూ ఎంతో టేస్ట్ గా ఉన్నప్పటికీ చికెన్ ఎక్కువ తింటే మాత్రం కొన్ని సమస్యలు రావడం ఖాయం అంటున్నారు.
డీప్ ప్రైడ్ చికెన్ రెగ్యులర్ తీసుకుంటే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశముందని అమెరికన్ జర్నర్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తేల్చింది. అంతేకాదు. వేసవిలో చికెన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరిగిపోయి తద్వారా తరచూ ముక్కు కారడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. చికెన్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందట. చికెన్‌లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుందని అందుకుఏ తొందరగా బరువు పెరిగిపోతారని నిపుణులు పేర్కొంటారు. యాంటిబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వల్ల యూరినల్ సమస్యలు పొంచే ప్రమాదం ఉందట. చికెన్ తినడం మంచిదే కానీ.. ఎక్కువగా తింటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.