ప్రస్తుతం టీమిండియా క్రికెట్ జట్టులో మోస్ట్ ఫిట్నెస్ ప్లేయర్ ఎవరంటే టక్కున విరాట్ కోహ్లీ పేరు చెబుతారు. 30 ఏళ్లు దాటిన యువ క్రికెటర్లను ఢీ కొట్టేలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు కోహ్లీ. ఒక విధంగా కోహ్లీని చూసి టీమిండియా జట్టులోని ఆటగాళ్లు అందరూ ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టి రాటుదేలారు. ప్రస్తుతం ఒకరు ఇద్దరు తప్ప అందరూ ఫిట్ గానే కనిపిస్తూ ఉంటారు. అయితే టీమ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషినింగ్ కోచ్ అంకిత్ కళ్యార్ చేసిన ఓ కామెంట్ మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. కోహ్లీ కంటే రోహితే ఫిట్ గా ఉంటాడని, ఆయన చేసిన వాక్యాలు విని అభిమానులు సైతం ఆలోచనలో పడిపోయారు.
Advertisement
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చూడడానికి లావుగా ఉన్న విరాట్ కోహ్లీ లానే ఉంటాడని టీమ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అంకిత్ కళ్యార్ అన్నాడు. రోహిత్ క్రికెట్ మైదానంలో చాలా చురుకుగా కదులుతాడని చెప్పుకొచ్చాడు. జట్టులో చోటు దక్కాలంటే కఠినమైన యోయో టెస్ట్ తప్పనిసరిగా పాస్ అవ్వాల్సి ఉంటుందని, అలాంటి యోయో టెస్టులోనూ రోహిత్ టాప్ ప్లేస్ లో నిలుస్తాడని కోచ్ అంకిత్ కళ్యార్ చెప్పుకొచ్చాడు. ఏ రోజు కూడా యోయో టెస్ట్ లో రోహిత్ ఫెయిల్ కాలేదంటే అతడి స్టామినా అర్థం చేసుకోవచ్చని వివరించాడు. రోహిత్ శర్మ చాలా మంచి ఫిట్ ప్లేయర్ అని, అద్భుతమైన ఫిట్నెస్ అతడి సొంతమని అన్నాడు.
అయితే రోహిత్ చూడడానికి కాస్త లావుగా కనిపిస్తుండడంతో చాలామంది అతడు ఫిట్నెస్ పై అనుమాన పడుతుంటారని, కానీ ఆ విషయంలో కొంచెం కూడా అనుమానం అవసరం లేదని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ లానే రోహిత్ కూడా ఫిట్ గా ఉంటారని, కాస్త లావుగా కనిపిస్తున్న మైదానంలో మాత్రం చిరుతల కదులుతాడని కితాబు ఇచ్చాడు. ఇక ఫిట్నెస్ విషయంలో విరాట్ ఒక ఉదాహరణగా నిలిచాడని అంకిత్ కళ్యార్ గుర్తుచేశాడు. జట్టులోకి ఫిట్నెస్ సాంస్కృతిని తీసుకువచ్చిన కోహ్లీ ఓ టాప్ ప్లేయర్ గా, ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ సారధిగా ఉన్నప్పుడు అందరూ ఫిట్ గా ఉండేలా చూస్తున్నాడని, ఫిట్నెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడని గుర్తుచేశాడు. గిల్ సైతం రాబోయే రోజుల్లో గొప్ప ఆటగాడిగా మారతాడని కళ్యాణ్ జోస్యం చెప్పాడు. బ్యాటింగ్, ఫిట్నెస్, స్కిల్ విషయంలో గిల్ విరాట్ ను అనుసరిస్తున్నాడని అన్నాడు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!