Home » IPL 2023 : ఒక్కో డాట్ బాల్ కి 500 మొక్కలు నాటనున్న బీసీసీఐ

IPL 2023 : ఒక్కో డాట్ బాల్ కి 500 మొక్కలు నాటనున్న బీసీసీఐ

by Bunty
Ad

బీసీసీఐ గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. ‘గో గ్రీన్’ కార్యక్రమంలో భాగంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో బౌలర్లు వేసే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటుతామని ప్రకటించింది. క్వాలిఫైయర్-1 నుంచి ఫైనల్ వరకు ఎన్ని డాట్ బాల్స్ పడితే అన్ని 500 మొక్కలు నాటనుంది.

Advertisement

ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా డాట్ బాల్ కు బదులు మొక్క సింబల్ ను చూపించాయి. ముందుగా ఈ సింబల్ ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే బీసీసీఐ చేసే గొప్ప పని గురించి తెలుసుకొని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి.

Advertisement

2021 సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన సీఎస్కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోని సేనను ఢీ కొట్టే జట్టు ఏది అనేది ఇంకా తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించింది. ధోని సేన గుజరాత్ పై చెన్నై 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని GT ఛేదించలేకపోయింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Visitors Are Also Reading