Home » కోహ్లీ ఎంపిక పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ…!

కోహ్లీ ఎంపిక పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ…!

by Azhar
Ad

విరాట్ కోహ్లీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఒక్కపుడు కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు చేస్తూ పరుగుల వారధి పారించడం వల్ల ఆ పేరు ట్రెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం వరుస వైఫల్యాల కారణంగా కోహ్లీ ట్రేండింగ్ లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2022 లో కోహ్లీ ఏ మాత్రం ఆకట్టుకోకపోవడం వల్ల.. అతను భారత జట్టులో ఉంటాడా.. లేదా అనేది ఇప్పుడు అభిమానులకు పెద్ద ప్రశ్న. దీని పైనే రోజు చర్చ జరుగుతుంది.

Advertisement

కానీ ఇప్పుడు ఆ చర్చలకు సమాధానంగా భారత జట్టులో కోహ్లీ స్థానం పై తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మెంబర్ స్పందించారు. కోహ్లీ పేలవ ఫేమ్ గురించి ఆయన మాట్లాడుతూ… క్రికెట్ ప్రపంచంలోని ప్రతి ఒక్క క్రికెటర్ ఈ రకమైన దశను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత దాని నుండి బయటకు వచ్చి తమ సత్త ఏంటో చూపించారు. ప్రస్తుతం కోహ్లీ కూడా ఇదే స్టేజ్ లో ఉన్నాడు. వారందరి మాదిరిగానే కోహ్లీ కూడా ఈ దదాను దాటి మళ్ళీ తన బ్యాట్ నుండి పారుగుల వరద పారిస్తాడు.

Advertisement

ఇక జట్టులో కోహ్లీ స్థానం గురించి మాట్లాడితే… మేము జట్టు ఎంపిక చేసేటప్పుడు కోహ్లీ ఏం అనుకుంటున్నాడు అనేది తెలుసుకుంటాం. అతను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటే మేము అతనికి రెస్ట్ ఇస్తాం. అలా కాకుండా ఒకవేళ అతను తన పేలవ ఫామ్ పైన ఫైట్ చేయాలి.. క్రికెట్ ఆడాలి అనుకుంటే తనను జట్టులోకి తీసుకుంటాం. ఎందుకంటే… కోహ్లీ సేవలు భారత జట్టుకు ఎంతో అవసరం. మా సెలక్టర్లకు ఎప్పుడు జట్టే ముఖ్యం కాబట్టి. ఆడాలా.. విశ్రాంతి తీసుకోవాలా అనేది కోహ్లీ చేతిలోనే ఉంది అని ఆ సెలక్షన్ కమిటీ మెంబర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

జడేజా ఎప్పటికి చెన్నైతోనే ఉంటాడట…!

Visitors Are Also Reading