Home » ఆసీస్ స్పిన్న‌ర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు..!

ఆసీస్ స్పిన్న‌ర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు..!

by Anji
Ad

బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుత ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్న‌ర్ కామెరాన్ బోయ్స్ డ‌బుల్ హ్యాట్రిక్‌తో మెరిసాడు. బీబీఎల్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు బోయ్స్‌. ఓవ‌రాల్గా టీ-20 క్రికెట్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెట‌ర్‌గా నిలిచాడు. సిడ్నీ థండ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్ ఏడో ఓవ‌ర్ చివ‌రి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేసాడు. ఆ త‌రువాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవ‌ర్ వేసిన బోయ్స్ వ‌రుస మూడు బంతుల్లో జాస‌న్ సంఘా, అలెక్స్ రాస్‌, డేనియ‌ల్ సామ్స్‌ల‌ను ఔట్ చేశాడు.

BBL 2021-22: Cameron Boyce Creates History With A 'Double Hat-trick' |  StumpsandBails.com

Advertisement

వ‌రుస‌గా బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డును సృష్టించాడు. అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయ‌డం ద్వారా హ్యాట్రిక్ సాధించిన బోయ్స్‌.. బీబీఎల్ ఈ ఘ‌న‌త సాధించిన ఎనిమిదో బౌల‌ర్‌గా నిలిచాడు. ఆ త‌రువాత బంతికే మ‌రొక వికెట్ తీసి డ‌బుల్ హ్యాట్రిక్ సాధించాడు. తాను వేసిన మూడ‌వ ఓవ‌ర్‌లో మ‌రొక వికెట్ తీసిన బోయ్స్ ఓవ‌రాల్‌గా నాలుగు ఓవ‌ర్ల‌లో 21 ప‌రుగులు ఇచ్చి ఐదు వికెట్ల‌ను తీశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

BBL 2021-22 LIVE: Boyce scripts history, becomes the first player to take 4  wickets in

సాధార‌ణంగా హ్యాట్రిక్ అంటే మూడు వ‌రుస బంతుల్లో మూడు వికెట్లు తీయ‌డం అని అంద‌రికీ తెలుసు. ఇక డ‌బుల్ హ్యాట్రిక్ అంటే వ‌రుస‌గా ఆరు వికెట్లు తీయ‌డ‌మ‌ని క్రికెట్ భాష‌లో అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్‌లో మాత్రం వ‌రుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయ‌డాన్ని డ‌బుల్ హ్యాట్రిక్ పేరుతో పిలుస్తుంటారు. ఒక ఓవ‌ర్ చివ‌రి బంతికి వికెట్‌.. త‌రువాత ఓవ‌ర్‌లో వ‌రుస‌గా మూడు బంతుల్లో మూడు వికెట్లు ఓవ‌రాల్‌గా 1,2,3 లేదా 2,3,4 వికెట్ల‌ను డ‌బుల్ హ్యాట్రిక్ గా కౌంట్ చేయ‌డం అక్క‌డ ఆన‌వాయితీ. ఐదు వ‌రుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని పిలుస్తుంటారు.

Visitors Are Also Reading