Home » బంగార్రాజు ఓటీటీ స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్..!

బంగార్రాజు ఓటీటీ స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్..!

by AJAY
Ad

నాగార్జున నాగచైత‌న్య హీరోలుగా న‌టించిన లేటెస్ట్ సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించగా నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాగార్జున హీరోగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇక ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా సంక్రాంతి బ‌రిలోకి దిగిన ఈ సినిమా సంక్రాంతి హిట్ గా కూడా నిలిచింది.

Advertisement

bangarraju movie

bangarraju movie

ఈ చిత్రానికి ఆంక్ష‌ల స‌మ‌యంలోనూ భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక ఈ సినిమాకు మ‌రో సీక్వెల్ కూడా ఉండ‌బోతుంది అంటూ నాగార్జున ప్ర‌క‌టించిన సంగ‌తి కూడా తెలిసిందే. ఇదిలా ఉండ‌గా థియేట‌ర్ల‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు కూడా రాబోతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 18 నుండి జీ-5 లో ప్ర‌సారం కానుంది. మ‌రి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ వ‌స్తుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading