Telugu News » Blog » జ‌న‌వ‌రి 14న బంగార్రాజు.. అధికారికంగా ట్వీట్‌..!

జ‌న‌వ‌రి 14న బంగార్రాజు.. అధికారికంగా ట్వీట్‌..!

by Anji
Ads

క‌రోనా నూత‌న వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ గా రూపాంతరం చెంది ప్రస్తుతం అందరినీ ఇబ్బందుల‌కు గురి చేస్తుంది.  ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా భారీ బ‌డ్జెట్ మూవీ అయిన‌ ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో కాబట్టి రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడుతోంది అని వదంతులు వచ్చినప్పటికీ.. చిత్రం యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటిస్తూ ప్రస్తుతం వస్తున్న రూమర్స్ ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఎట్టకేలకు జనవరి 14 న‌ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించి అభిమానులకు కాస్త ఊరట కలిగించింది.

Advertisement

Bangarraju: Teaser Of Nagarjuna & Naga Chaitanya's Flick To Drop On New  Year 2022

Advertisement

ఇక ప్రస్తుతం బంగార్రాజు సినిమా పై కూడా రోజురోజుకు రూమర్స్ ఎక్కువవుతున్న సంద‌ర్భంలో జీ స్టూడియోస్ వారు అధికారికంగా ఇవాళ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. వాటికి అనుగుణంగా అన్ని కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ చాలా అద్భుతంగా అన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని వెల్ల‌డించింది. ప్రస్తుతం అభిమానులను నిరాశ పరచే రూమర్స్ ఎన్నో వస్తున్నాయ‌ని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని జీ స్టూడియోస్ వారు అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునకు అనుకోని వరం.. సోగ్గాడికి మామూలు పండగ కాదుగా..

Advertisement

ఎట్టకేలకు నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది అన్న వదంతులు నమ్మకుండా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు అని జీ స్టూడియో వారు ప్రకటించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా వ‌స్తుంది. ఇక బంగార్రాజు సినిమా జీ స్టూడియోస్, అన్నపూర్ణస్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.