Home » యూపీ సీఎంతో బండ్ల గ‌ణేష్ ఫోటో వైర‌ల్…షాక్ లో నెటిజ‌న్లు..!

యూపీ సీఎంతో బండ్ల గ‌ణేష్ ఫోటో వైర‌ల్…షాక్ లో నెటిజ‌న్లు..!

by AJAY
Ad

బండ్ల‌గ‌ణేష్ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్కర్లేదు. న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గ‌ణేష్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. కామెడీ రోల్స్ తో న‌వ్వించేవాడు. కానీ నిర్మాత‌గా మారి అంద‌ర్ని అవాక్క‌య్యేలా చేశాడు. ర‌వితేజ హీరోగా న‌టించిన ఆంజనేయులు సినిమాతో బండ్ల గ‌ణేష్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

Advertisement

Advertisement

ఆ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాన్ తో తీన్మార్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో బండ్ల గ‌ణేష్ కు భారీ న‌ష్టాలు వ‌చ్చాయి. ఇక ఆ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ తో బండ్ల‌గ‌ణేష్ కు మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో బండ్ల గ‌ణేష్ స్టార్ ప్రొడ్యూస‌ర్ గా మారిపోయాడు. కార‌ణం తెలియ‌దు కానీ బండ్ల గ‌ణేష్ రీసెంట్ గా ఏ సినిమా చేయ‌లేదు.

ఇదిలా ఉండ‌గా రాజ‌కీయాల్లోనూ బండ్ల గ‌ణేష్ చురుకుగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా బండ్ల గ‌ణేష్ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు రెండోసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన యోగి ఆదిత్య‌నాథ్ కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో బండ్ల యోగితో క‌లిసి ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన బండ్ల గ‌ణేష్ అభిమానులు బండ్ల గ్రేట్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Visitors Are Also Reading