బండ్ల గణేష్ టాలీవుడ్ లో బడా నిర్మాతగా, కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ప్రతి రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఆయన స్పీచ్ లు అందులో ఉండే ప్రాసలు, పేల్చే బుల్లెట్లు మాటల తూటాలకు అందరూ ఫిదా అవుతుంటారు. పవన్ కళ్యాణ్ భక్తుడు అంటూ గణేష్ ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న బండ్ల గణేష్.
Advertisement
కరోనా మహమ్మారీ సమయంలో చాాలా మందికి సాయం చేశాడు. ఉద్యోగాలు పెట్టించే ప్రయత్నం కూడా చేశాడు. అడిగిన వారికి చేతనైనంత డబ్బు కూడా ఇచ్చాడు. ఇప్పటికీ కూడా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎవరికో ఒకరికో ఒకరికీ తనవంతుగా సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ నెటిజన్ వేసిన ట్వీట్ కు స్పందించాడు. రూ.1000 గూగుల్ పే చేశాడు. ఓ దివ్యాంగురాలు బాధ చూసిన బండ్ల గణేష్ ఆ అమ్మాయి వివరాలు కావాలని అడిగాడు. దీంతో ఓ నెటిజన్ గూగుల్ పే నెంబర్ పంపించాడు. దీంతో బండ్ల గణేష్ రూ.1000 గూగుల్ చేసిన దానిని ట్వీట్ చేశాడు.
https://t.co/STEHk5InjX pic.twitter.com/ayov6FkdBV
Advertisement
— BANDLA GANESH. (@ganeshbandla) December 8, 2022
దీంతో బండ్ల గణేష్ పై కొంత మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నీ రేంజ్ కి ఇవ్వడం ఏంటి..? అన్నా అని నిలదీస్తున్నారు. ఈ మాత్రం దానికి డీటైల్స్ కావాలని అడిగావా ? కొందరూ అయితే అది కరెక్ట్ నెంబర్ అవునో కాదో చెక్ చేసి ఉంటాడని.. ఆ తరువాత పెద్ద మొత్తంలో డబ్బు పంపించి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. పంపించింది వెయ్యి రూపాయలు దానికి పబ్లిసిటినా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. ఎంతో కొంత అయితే పంపించాడు.. పంపించడం కూడా గ్రేట్.. అది కూడా పంపని వాళ్లు ఉన్నారు కదా అని మరో నెటిజన్ పేర్కొనడం విశేషం. అలా మొత్తానికి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ మాత్ర సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిందనే చెప్పాలి. వాస్తవానికి బండ్ల గణేష్ కేవలం రూ.1000 మాత్రమే పంపించాడా ? ఎక్కువ పంపించాడా అనేది మాత్రం క్లారిటీ లేదు.
Also Read : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న