Telugu News » బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్‌.. ప‌వ‌న్ మోసం చేశాడా అంటూ ట్వీట్ పై కామెంట్స్‌..!

బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్‌.. ప‌వ‌న్ మోసం చేశాడా అంటూ ట్వీట్ పై కామెంట్స్‌..!

by Anji

బండ్ల గణేష్ పేరుని ఇక ప్రత్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ఓ కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. ఇక సోషల్ మీడియాలో పవన్ జపం చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుండేవాడు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం చూసుకుంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు బండ్ల గణేష్. సామాజిక మాధ్యమాల్లో బండ్ల‌గ‌ణేష్ ట్వీట్ చేశాడంటే అది త‌ప్ప‌కుండా వైర‌ల్ అవుతుండేది. ట్విట్టర్ లో తనదైన కోణంలో లో పోస్టులు చేయ‌డ‌మే బండ్ల‌ గణేష్ నైజం. పవన్ కళ్యాణ్ పై ఈగ వాలినా కూడా అస్సలు ఊరుకోరు. పవన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా.. తప్పుడు పోస్టులు పెట్టినా వెంటనే రియాక్ట్ అవుతూ కౌంటర్లు వేస్తుంటారు బండ్ల గణేష్.

 

పవన్ క‌ల్యాణ్ నా దేవుడు అని చెబుతూ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటారు.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్.. తాజాగా ట్విట్టర్ లో ఓ ఆడియో టేప్ ను విడుదల చేశాడు. జీవితంలో ఎవరిని నమ్మొద్దు అంటూ బండ్ల చెప్పిన మాటలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉన్నట్టుండి ఆయన ఎందుకు ఉపొద్ఘాతం ఇస్తున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ఎవరిని నమ్మొద్దని.. మనల్ని మనం నమ్ము కుందామని బండ్ల గణేష్ అన‌డం.. అదేవిధంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భార్య పిల్ల‌ల‌ను నమ్మకుందామని చెప్పాడు. ముఖ్యంగా మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇద్దామని.. మన తల్లిదండ్రులు మన మీద కోటి ఆశలతో ఉన్నారని పేర్కొన‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నాడు. ఎప్పుడు లేనిది బండ్ల‌గ‌ణేష్ అక‌స్మాత్తుగా ఇలాంటి డైలాగ్‌లు మాట్లాడ‌డంతో అస‌లు ఏమి జ‌రిగింది..? అని త‌ర్జ‌న భ‌ర్ఝ‌న‌లో ప‌డ్డారు

.

కొంద‌రూ నెటిజ‌న్లు అయితే ఏమైంది గణేష్ అన్న.. ఏమైనా ఎదురు దెబ్బ తగిలిందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా హ్యాండ్ ఇచ్చాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా సగర్వంగా చెప్పుకునే బండ్ల గణేష్ ఇప్పుడిలా పవన్ పేరు ప్రస్తావించకుండా జీవితంలో ఎవ్వడినీ నమ్మొద్దు అనడంతో పలు అనుమానాలకు దారి తీసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన బండ్ల గణేష్.. ప్రొడ్యూసర్ గా మారి పెద్ద హీరోలతో చిత్రాలను నిర్మించాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తీశారు. ఇటీవల బండ్లగణేష్ హీరోగా కూడా ట్రై చేశాడు. డేగల బాబ్జీ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆశించిన స్పందన మాత్రం రాలేద‌నే చెప్పాలి.

You may also like