Home » పవన్ ను అవణించిన బండ్ల గణేష్… ఫైర్ అవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్…!

పవన్ ను అవణించిన బండ్ల గణేష్… ఫైర్ అవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్…!

by Azhar
Ad
మన తెలుగులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరూ మొదటగా సీజెప్పే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రజల్లోనే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాల మంది హీరోలలో కూడా ఆయనే తన అభిమాన హీరో అంటూ తెలుపుతుంటారు. ఇక ఆయా గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం పవన్ ఫ్యాన్స్ ఎవరిని వదిలి పెట్టారు. వారిని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా పవన్ గురించి తప్పుగా మాట్లాడితే వారికీ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గట్టి సమాధానం ఇస్తాడు.
అయితే పవన్ ప్రతి సినిమా ఫంక్షన్ లోను ఆయన స్పీచ్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో బండ్ల గణేష్ స్పీచ్ కోసం కూడా అలానే ఎదురు చూస్తారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఎప్పుడు చెప్పే బండ్ల గణేష్ ఇప్పుడు ఆయననే అవమానించాడు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ బండ్లన్నను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే… బండ్ల గణేష్ ఇంతకముందు తన ఇంట్లో పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను పెట్టుకునేవాడు. దానిని అభిమానులకు కూడా చూపించాడు.
కానీ ఇప్పుడు ఆ ఫోటోను తీసేసాడు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల నిన్న ఎవరిని నమ్మవద్దు అంటూ ఓ ఆడియో పోస్ట్ చేసాడు. కానీ అది ఎవరి కోసం చేసాడు అనేది ఏకారికి అర్ధం కాలేదు. ఇక ఈరోజు మరో ఫోటో పోస్ట్ చేసాడు. అందులో పవన్ కళ్యణ్ ఫోటో ఉన్న చోట తన తలిదండ్రుల ఫోటోను పెట్టాడు. అక్కడి నుండి ఆ పవన్ ఫోటోను తీసేసాడు. దాంతో గణేష్ నిన్న పెట్టిన ఆడియో కూడా పవన్ ను ఉద్దేశించే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అందువల్ల ఇప్పుడు బండ్ల గణేష్ ను ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

Advertisement

Visitors Are Also Reading