Home » గబ్బర్ సింగ్ లో శృతి వద్దన్న బండ్ల..కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?

గబ్బర్ సింగ్ లో శృతి వద్దన్న బండ్ల..కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?

by AJAY
Ad

టాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల లో గబ్బర్ సింగ్ సినిమా కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో గబ్బర్ సింగ్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు ముందు శృతిహాసన్ సైతం వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.

Gabbar singh

Advertisement

కానీ గబ్బర్ సింగ్ తో మాత్రం మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ ను తీసుకునేందుకు కూడా ముందు చాలా ఆలోచించానని బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ముందుగా శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని… కాబట్టి హీరోయిన్ నుండి ఆమెను తప్పించే ఆలోచన చేసినట్టు చెప్పారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వెళ్లి చెప్పగా నువ్వు అన్ని బ్లాక్ బస్టర్ సినిమా లు తీసావా అంటూ తనపై పంచ్ వేశారని ఆ తర్వాత శృతినే సినిమాలో కంటిన్యూ అయిందని బండ్లగణేష్ వెల్లడించారు.

Advertisement

ఇక ఇక గబ్బర్ సింగ్ తర్వాత శృతి హాసన్ కెరీర్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్లతో దూసుకుపోయింది. అప్పటివరకు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఆ తర్వాత గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. హీరోలకు డేట్లు ఇవ్వలేనంత బిజీగా మారిపోయింది. ఇక ఇప్పటికీ శ్రుతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. మరోవైపు తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ శృతిహాసన్ సినిమాలు చేస్తోంది.

Also read :

Visitors Are Also Reading