Home » ఆ హీరోలను అవ‌మానించిన బండ్ల గ‌ణేష్‌.. క్షమాపణలు చెప్పాలంటున్న ఫ్యాన్స్…!

ఆ హీరోలను అవ‌మానించిన బండ్ల గ‌ణేష్‌.. క్షమాపణలు చెప్పాలంటున్న ఫ్యాన్స్…!

by Azhar
Ad

టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లలో ఒక్కరైనా పూరి జగన్నాథ్.. తన కొడుకును స్టార్ హీరో చేయాలనీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా వస్తున్న సినిమా చోర్ బజార్. ఈ మధ్యే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి పూరి జగన్నాథ్ రాలేదు అనే విషయం అందరికి తెలుసు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవర కొండా హీరోగా జన గణ మన అనే సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లనే ఆయన రాలేదు. అయితే ఈ ఫంక్షన్ కు నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యాడు.

Advertisement

అయితే బండ్ల గణేష్ ఈవెంట్స్ లో ఇచ్చే ఏ స్పీచ్ అయిన సరే కొంత విరాంశాలకు ధరి తీస్తుంది. కానీ ఈసారి మాత్రం అది ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే…ఈ స్పీచ్ లో బండ్ల కొంతమంది హీరోల పేర్లు కూడా తీసాడు. ఇందులో బండ్ల గణేష్ మాట్లాడుతూ… పూరి జగన్నాథ్ అన్న నువ్వు సరిగ్గా డైలాగ్స్ కూడా రాణి వాళ్ళని మెగాస్టార్, సూపర్ స్టార్ చేసావ్. కానీ ని కొడుకు సినిమా ఫంక్షన్ కు నువ్వు లేవు. అందుకే నువ్వు చేస్తుంది అని తప్పు అని అన్నాడు. అయితే ఇందులో మెగాస్టార్, సూపర్ స్టార్ అనే పేర్లను బండ్ల వాడటం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

Advertisement

ఎందుకంటే రామ్ చరణ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా చిరుతకు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసాడు. ఇప్పుడు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అయ్యాడు. అలాగే మహేష్ బాబును సూపర్ స్టార్ గా మార్చిన సినిమా పోకిరి. దీనికి కూడా పూరినే డైరెక్టర్. కాబట్టి ఈ హీరోలను ఉద్దేశించే బండ్ల గణేష్ డైలాగ్స్ కూడా రాణి వాళ్ళు అంటూ వ్యాఖ్యలు చేసాడని.. ఆ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు/ అలాగే బండ్ల గణేష్ మా హీరోలకు బహిరంగంగా క్షమాపణలు హిప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఇండియా టెస్ట్ ఓపెనర్ గా తెలుగు కుర్రాడు..!

ఆ విషయంలో రూట్ ఐడియా కాపీ కొట్టిన కోహ్లీ..!

Visitors Are Also Reading