బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్ ఒక సెన్సేషన్….క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ తీన్ మార్ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి వరకూ బండ్ల గణేష్ ను సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకునే వ్యక్తిగా చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కానీ మొదటి సినిమా బండ్ల గణేష్ కు నిర్మాతగా అనుకున్నమేర హిట్ ఇవ్వలేదు. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ పేరు మారుమోగిపోయింది. ఆ తరవాత బండ్ల గణేష్ ఓ బడా వ్యాపారవేత్త అని కోళ్ల ఫార్మ్ బిజినెస్ చేస్తారని అందరికీ తెలిసిపోయింది.
Advertisement
ఇక ఆ తరవాత బండ్ల గణేష్ మరికొన్ని సినిమాలను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించినా అశించినమేర విజయం సాధించలేకపోయాయి. దాంతో ఇప్పటికీ పవన్ కల్యాణ్ వీరాభిమానిగా ఆయనతోనే సినిమా చేస్తానని బండ్ల గణేష్ చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఇప్పుడు ఫుల్ లెన్త్ పాత్రలో డేగల బాబ్జిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉండగా సినిమాలతో పాటూ బండ్లగణేష్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
అంతే కాకుండా కాంగ్రెస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ ఇంటర్య్వూలతో సోషల్ మీడియాను షేక్ చేశారు. కాంగ్రెస్ గెలిచితీరుతుందంటూ దీమా వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ఘోర పరాజయం తరవాత తనకు రాజకీయాలు పనికిరావు అని చెబుతూ గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ కు బొత్స సత్యనారాయణకు తనకు సంబంధాలు ఉన్నాయని ఆయనకు బినామీ అంటూ కూడా అప్పట్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి.
also read : చిరంజీవి అలా అడగటం నన్ను బాధించింది… తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు …!
అయితే ఓ ఇంటర్వ్యూలో దీనిపై బండ్ల గణేష్ స్పందించారు. తను ఎక్కువగా ఆయనతో తిరగటం వల్ల అలాంటి వార్తలు వచ్చాయని చెప్పారు. తాను బొత్స కు బినామీ కాదని యూనియన్ బ్యాంకుకు బినామీ అని చెప్పారు. ఆ బ్యాంకులోనే తాను అప్పులు తీసుకుని డబ్బులు కడుతున్నానని చెప్పారు.