Telugu News » బాలింతలు చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!!

బాలింతలు చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!!

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలంటేనే జనాలు భయంతో జంకుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ వారు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో శరీరంలోకి ఎక్కువగా వాటర్ సోర్స్ ఉన్న ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే మంచిది. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జ్యూస్ లు తాగితే మంచిదో చూద్దాం..!! ఇంట్లో నుంచి బయటకు రాగానే మనకు బయట ఎన్నో జ్యూస్ పాయింట్స్ తారసపడతాయి. అందులో ముఖ్యంగా చెరుకు తో తయారుచేసిన జ్యూస్ ను తాగితే చాలా మంచిది.

ఇది ముఖ్యంగా డీహైడ్రేట్ నుంచి రక్షిస్తుంది. అలాగే అలసట మరియు నీరసం నుంచి త్వరగా శక్తిని పొందవచ్చు. ఎందుకంటే ఇందులో చక్కెర మరియు ఇనుము ఉంటాయి. శరీరం నుంచి అనవసరమైన నీటిని బయటకు పంపి, తద్వారా వేసవిలో ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే చెరుకు రసంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియతో పాటుగా మలబద్ధకాన్ని మెరుగుపరుస్తుంది. చెరుకు రసం

 

తాగడం వల్ల వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. సంతానోత్పత్తి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని పరిశోధనల ద్వారా తెలిసింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు చెరుకు రసం తాగడం వలన పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖంపై మొటిమల సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు చెరుకు రసం తాగడం అనేది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Visitors Are Also Reading