Home » Unstoppable promo : వెన్నుపోటు అంశం పై స్పందించిన బాలయ్య..కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంటూ షాకింగ్ కామెంట్స్..!

Unstoppable promo : వెన్నుపోటు అంశం పై స్పందించిన బాలయ్య..కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంటూ షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ad

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు అఖండ చిత్ర యూనిట్ అతిథులుగా వచ్చారు. ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, విలన్ గా నటించిన శ్రీకాంత్ తో పాటు సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఎంతో వినోదాత్మకంగా ఉండడంతోపాటు బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ తో జై బాలయ్య పాటలు స్టెప్పులు వేశారు. అంతేకాకుండా యూనిట్ సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడి అలరించారు.

Advertisement

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఎవడైనా హీరోగా చేస్తానంటే తాను విలన్ గా చేయడానికి సిద్ధం అంటూ కామెంట్ చేశారు. అయితే ఆ తర్వాత ట్విస్ట్ ఇచ్చారు… అందులో హీరో కూడా నేనే ఉండాలి అంటూ బాలయ్య ప్రకటించారు. దాంతో తనకు విలన్ గా నటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మరోవైపు అఖండ సినిమాలోని డైలాగ్ ను శ్రీకాంత్ చెప్పగా ఆ తర్వాత హీరో డైలాగ్ ను బాలయ్య అందుకుని ఆకట్టుకున్నారు. తమన్ తో బాల్ గ్లాసులో వేసే ఆట ఆడి అతడి పై ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ… మీరు ప్రపంచానికి ప్రశ్న ఏమో కానీ నాకు మాత్రం మీరు సమాధానం అంటూ బాలయ్య పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ బోయపాటి సార్… బాలయ్య సార్ అంటూ ఉంటే బాలయ్య సార్ సార్ ఏంటి అని ప్రశ్నించారు. దాంతో ప్రగ్యా జైస్వాల్ ఓకే బాల అంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

Balayya unstoppable with akhanda team

Balayya unstoppable with akhanda team

దాంతో బాలయ్య ఒక్కసారిగా షాకయ్యారు. అదేవిధంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే వెన్నుపోటు అంశంపై బాలయ్య ఈ ప్రోమోలో స్పందించారు. ఆ మాట విన్నప్పుడల్లా తనకు కళ్ళలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. ఆయన తనకు తండ్రి అని.. అంతే కాకుండా అతను ఎంతో అభిమానించే హీరో అని వ్యాఖ్యానించారు. అయితే వెన్నుపోటు అంశంపై బాలయ్య ఏమన్నారో తెలియాలంటే బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Visitors Are Also Reading