Home » బాలయ్య రిజెక్ట్ చేసిన ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టు..ఏంటవి..?

బాలయ్య రిజెక్ట్ చేసిన ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టు..ఏంటవి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

దర్శక నిర్మాతలు సినిమా తీస్తున్నారు అంటే ముందుగానే హీరోను ఊహించుకొని కథలు రాస్తూ ఉంటారు. పలానా హీరోకు పలానా హీరోయిన్ కు ఈ కథ అయితే బాగా సెట్ అవుతుందని భావిస్తారు. అలా రాసుకున్న కథలను తీరా వారికి వినిపిస్తే రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా రిజెక్ట్ చేసిన ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయ్యో అది నేను చేయలేకపోయానే అనే బాధ కూడా పడ్డ సందర్భాలు ఇండస్ట్రీలో అనేకం. అయితే బాలకృష్ణ విషయంలో అదే జరిగింది.. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం..

Advertisement

బజార్ రౌడీ చిత్రాన్ని దర్శకుడు కోదండరామిరెడ్డి బాలకృష్ణతో చేద్దామనుకున్నారట. కానీ బాలకృష్ణ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కృష్ణ తనయుడు రమేష్ బాబుతో తీసి హిట్ కొట్టాడు. చిన్న తంబి అనే తమిళ మూవీ రీమేక్ చంటి మూవీ ని ముందుగా బాలయ్య చేయాలని అనుకుంటే కథ నచ్చక రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ఫిక్స్ అయినప్పటికీ చివరికి వెంకటేష్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలాగే సూర్యవంశం మూవీని బాలయ్యతో చేయాలని సినిమా నిర్మాత ఆర్ బి చౌదరి అనుకున్న కానీ పెద్దన్నయ్యకి స్టోరీ దగ్గరగా ఉందని కాదని చెప్పడంతో వెంకటేష్ చేసి హిట్టు కొట్టాడు.

Advertisement

నరసింహుడు నిర్మాత చెంగల వెంకటరావుని డైరెక్టర్ వి సముద్ర కలిసి బాలకృష్ణతో సింహరాశి చేయడానికి కసరత్తు చేస్తుంటే సమరసింహారెడ్డి సక్సెస్ తో ఇలాంటి సినిమా కరెక్ట్ కాదని బాలయ్య చెప్పడంతో డాక్టర్ రాజశేఖర్ తో చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి మొదట సీతయ్య కథని బాలకృష్ణ కోసమే రాశారట. కానీ ఆ సమయంలో చెన్నకేశవరెడ్డి సినిమాతో బిజీగా ఉండటంతో ఆ చిత్రాన్ని హరికృష్ణ చేసి హిట్ కొట్టాడు. అంతేకాకుండా సింహాద్రి సినిమాకి కూడా ముందుగా బాలకృష్ణని అనుకున్నారట.కానీ బాలయ్య కు కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

also read:Michael OTT : “మైఖేల్” ఓటిటి డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే

Visitors Are Also Reading