Home » న్యూస్ రిపోర్ట్రర్ కి అద్దిరిపోయే పంచ్ వేసిన బాలయ్య ..! అతను అడిగిన ప్రశ్న ఏంటంటే ?

న్యూస్ రిపోర్ట్రర్ కి అద్దిరిపోయే పంచ్ వేసిన బాలయ్య ..! అతను అడిగిన ప్రశ్న ఏంటంటే ?

by AJAY
Ad

న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు 26వ వ‌ర్థంతి సంధ‌ర్బంగా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ మంగ‌ళ‌వారం ర‌సూల్ పూర్ చౌర‌స్తాలో అమ‌ర‌జ్యోతిని వెలిగించారు. ఎన్టీఆర్ విగ్రహానికి బాల‌య్య పూల‌మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సంధ‌ర్బంగా బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ….ఎన్టీఆర్ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌ని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కూ ఎన్టీఆర్ ను ఎవ‌రూ మ‌ర్చిపోలేర‌ని బాల‌య్య అన్నారు. ఇక అనంత‌రం బాల‌య్య వెళుతుండగా ఓ మీడియా ప్ర‌తినిధిపై ఫైర్ అయ్యారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రించాల‌ని వ్య‌క్తిగ‌త దూరం పాటించాల‌ని చెప్పారు. అయితే అదే స‌మ‌యంలో ఓ రిపోర్టర్ సామాజిక దూరం పాటించాలి అంటూ మ‌ధ్య‌లో మాట్లాడారు.

Advertisement

balakrishna

balakrishna

దాంతో బాల‌య్య ఒక్క‌సారిగా ఫైర్ అయ్యారు. సామాజిక దూరం కాదు..వ్య‌క్తిగ‌త దూరం గాడిద అంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజ‌న్ ఇంకా న‌యం బాల‌య్య రిపోర్ట‌ర్ పైకి ఫోన్ విసురుతాడని అనుకున్నా అంటూ కామెంట్ చేయ‌గా మ‌రో నెటిజ‌న్ బాల‌య్య రాక్స్ రిపోర్ట‌ర్ షాక్ అంటూ కామెంట్ పెట్టాడు.

Advertisement

also read : విడాకుల ప్ర‌క‌ట‌న‌కు ముందు ర‌జినికి ధ‌నుష్ ఫోన్…ఆయన ఏమ‌న్నారంటే…!

ఇదిలా ఉంటే బాల‌య్య వ్యాఖ్య‌లను ఆయ‌న అభిమానులు సీరియ‌స్ గా తీసుకోరు అయ‌న‌ది చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అని చెబుతుంటారు. బాల‌య్య‌తో సినిమాలు చేసిన వాళ్లు సైతం ఆయ‌న చాలా మంచి వార‌ని చిన్న పిల్ల‌ల మన‌స్త‌త్వం అని చెబుతూ ఉంటారు.

Visitors Are Also Reading