Home » హిందూపురంలో బాలయ్య సందడి…ముస్లిం గెటప్ లో వెళ్లి…!

హిందూపురంలో బాలయ్య సందడి…ముస్లిం గెటప్ లో వెళ్లి…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా బాలయ్య అఖండ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా తో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మరో హిట్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో హాట్రిక్ నమోదు అయింది.

Advertisement

ఇదిలా ఉండగా బాలయ్య రాజకీయాల్లో కూడా ఎంతో చురులుగా ఉంటున్నారు అన్న సంగతి తెలిసిందే. బాలయ్య హిందూ పురం నియోజకవర్గం కు ఎమ్మెల్యే గా సేవలు అందిస్తున్నారు. దాంతో అప్పుడప్పుడూ బాలయ్య హిందూ పురంలో సందడి చేస్తుంటారు.

Advertisement

ఇక తాజాగా బాలయ్య మరోసారి హిందూ పూర్ కు వెళ్లారు. అక్కడ టిడిపి మైనారిటీ నేత ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. వధూ వరుల బాలయ్య ఆశీర్వదించారు.

అయితే ఈ శుభకార్యానికి బాలయ్య ముస్లిం గెటప్ లో రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలయ్య కు ఆత్మీయ స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading