అభిమానుల కోరిక మేరకే దర్శకనిర్మాతలు కూడా బాలయ్య సినిమాని తెరకెక్కిస్తారు. కానీ ఒక్క ఫైట్ లేకుండా ఒక్క స్టెప్పు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి రికార్డు క్రియేట్ చేశారు బాలయ్య. ఆ మూవీ నారి నారి నడుమ మురారి. అంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణాలు రెండే రెండు. ఒకటి బాలకృష్ణ నటన. కాగా, రెండవది కథ.
READ ALSO : ఎండాకాలంలో వీళ్లు అస్సలు పుచ్చకాయని తీసుకోకూడదు…!
Advertisement
అత్త అల్లుళ్ల డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాత మురారి ఈ సినిమాని తెరకెక్కించారు. బాలకృష్ణతో ఆయనకు ఇవి రెండవ సినిమా. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో సీతారామ కళ్యాణం అనే మూవీ వచ్చింది.
Advertisement
READ ALSO : ఎండాకాలంలో కూల్ వాటర్ తాగేస్తున్నారా…? అయితే ఈ విషయాలను తెలుసుకోండి
నారి నారి నడుమ మురారి సినిమాకు కీరవాణి తండ్రి శివశక్తి దత్త, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, కథ రచయితలు కావడం విశేషం. ఇందులో బాలకృష్ణ సరసన శోభన, నిరోష హీరోయిన్స్ గా నటించారు. సినిమాలోని పాత్రలను తమిళనాడులోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో తీశారు. సినిమా పతాక సన్నివేశాల్లో దాదాపు 22 నిమిషాలు బాలకృష్ణ కనిపించకపోవడం విశేషం. ఈ సినిమా 1990 ఏప్రిల్ 27న విడుదలై సూపర్ హిట్ కొట్టింది.
READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!