Home » ‘లక్ష్మి నరసింహ’ సినిమా విడుదల రోజున ఎందుకు 144 సెక్షన్ పట్టాల్సివచ్చింది ?

‘లక్ష్మి నరసింహ’ సినిమా విడుదల రోజున ఎందుకు 144 సెక్షన్ పట్టాల్సివచ్చింది ?

by AJAY
Ad

నరసింహం నందమూరి బాలకృష్ణ పోలీస్ పాత్రలో నటించిన సినిమా లక్ష్మీ నరసింహ. ఈ సినిమా 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలకృష్ణ రేంజ్ పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత బాలయ్య నటించిన భలేవాడివి బాసు, సీమ సింహం లాంటి సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా సోసో గా అనిపించింది. ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించారు.

ALSO READ : బండ్ల గ‌ణేష్ ఆ పొలిటిక‌ల్ లీడ‌ర్ బినామీనా..?

Advertisement

balayya laxmi narasimha

balayya laxmi narasimha

అంతే కాకుండా ఈ సినిమా హిట్ కాకపోవడంతో బెల్లంకొండ సురేష్ కూడా చాలా బాధ పడ్డారు. అంతే కాకుండా మరో సారి బాలయ్య తనకు అవకాశం ఇవ్వాలని ఈసారి ఇండస్ట్రీ హిట్ ఇస్తానని కోరారు. దాంతో బాలయ్య కూడా ఒప్పుకున్నారు. ఆ సమయంలో లో విక్రమ్ హీరోగా నటించిన తమిళ సినిమా స్వామి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో స్వామి రీమేక్ రైట్స్ ను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. స్వామి స్పెషల్ షో చూసిన బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకత్వం వహించేందుకు ఈశ్వర్ సినిమా దర్శకుడు జయన్ ఒప్పుకున్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు చంద్రబాబుతో పాటు ఏఎన్ఆర్ వచ్చారు. ఆడియో సూపర్ హిట్ గా నిలిచింది. జనవరి 14 -2004 లో ఎన్నో అంచనాల మధ్యన సినిమా విడుదల అయ్యింది. మరోవైపు ఎన్టీఆర్ ఆంధ్రావాలా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు కసిగా ఉన్నారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 432 థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు నందమూరి అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో థియేటర్ల వద్ద రచ్చరచ్చ చేశారు.

దాంతో థియేటర్ల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా మొదటిసారి 144 సెక్షన్ విధించారు. అదే సమయంలో అంజి సినిమా కూడా విడుదల అవడం దీనికి ఒక కారణం. అయితే బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించిన బెల్లంకొండ సురేష్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని 50 రోజులకే మధ్యలో థియేట‌ర్ల నుండి తీసేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. బెల్లంకొండ సురేష్ వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవ‌లేకపోయిందని నందమూరి అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Visitors Are Also Reading