Home » 200 కోట్లతో బాలయ్య అఖండ విజయం…!

200 కోట్లతో బాలయ్య అఖండ విజయం…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా అఖండ తో వీరిద్ద‌రూ హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఈ రోజుతో అఖండ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకి పైగా సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది.

Advertisement

ఇక ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అఖండ చిత్రం ఇప్పటికే 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మిగతా యాభై కోట్లను థియేట్రికల్ బిజినెస్ గా అందుకని మొత్తంగా ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ 200 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్ర‌గ్యా జైస్వాల్ నటించగా తమన్ స్వరాలు సమకూర్చారు.

Advertisement

ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ప్లస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక బాలకృష్ణ అఖండ‌ విజయం పై అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో 200 కోట్ల క్లబ్ లో చేరడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య తన తదుపరి సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.

Balayya

Balayya akhanda movie review

ఇక ఈ సినిమాకు బాలయ్య తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. అఖండ‌ సినిమా విజయంతో తో బాలయ్య రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య ఆహాలో టాక్ షో తోనూ అదరగొడుతున్నారు.

Visitors Are Also Reading