Home » వీరసింహారెడ్డి గా రాబోతున్న బాలయ్య

వీరసింహారెడ్డి గా రాబోతున్న బాలయ్య

by Anji
Ad

గత ఏడాది విడుదలైన అఖండ సినిమా విజయంతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ 107 వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఏ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

Also Read : రిషబ్ శెట్టి: కాంతార లో “ఓ” అనే అరుపు చాలా సెంటిమెంట్.. ఎవరు అనుకరించవద్దు..!!

Advertisement

ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ టైటిల్ ని ఖరారు చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు పై 3డి టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేశారు మేకర్స్. ‘సింహ’ పేరుతో బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.

Advertisement

Also Read : చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిస్తే అధికారం కాదు అంద‌కార‌మే…! వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. టైటిల్ పోస్టర్ బాలకృష్ణ ఫెరోషియస్ గా కనిపించారు. పోస్టర్ పై గర్జించే సింహం బాలకృష్ణ క్యారెక్టర్ నీ ప్రతిబింబిస్తుంది. టైటిల్ పోస్టర్ బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహాలా కనిపిస్తున్నారు. పులిచెర్ల నాలుగు కిలోమీటర్ల మైలు స్టోన్ కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇక ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం పేర్కొంది.

Also Read : కాంతార కంటే ముందే అదే కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమా ఏంటో మీకు తెలుసా..? కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందంటే..?

 

Visitors Are Also Reading